ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన

Mar 21 2026 6:40 AM | Updated on Mar 21 2026 6:40 AM

గన్‌ఫౌండ్రీ: కూచిపూడి, భరతనాట్య, జానపద నృత్యాలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. శుక్రవారం రవీంద్రభారతిలో గ్లోబల్‌ ఈవెంట్స్‌ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ పూర్వ చైర్మన్‌ కోలేటి దామోదర్‌గుప్తా మాట్లాడుతూ.. పండుగల ప్రాముఖ్యత, విలువలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని అభిప్రాయపడ్డారు. అనంతరం పలువురు నాట్య గురువులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సినీ నటుడు పృథ్వీ, వ్యాపారవేత్త ఎస్‌. రాజా, సంస్థ వ్యవస్థాపకులు లయన్‌ కేవీ రమణారావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement