హైదరాబాద్ : రవీంద్ర భారతిలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో యువ నాటకోత్సవాల్లో భాగంగా గురువారం నషా హీ నషా నాటకాన్ని ప్రదర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తిలకించారు.
కళాకారులను సంస్కృతీ సంప్రదాయాలకు వారధులుగా అభివర్ణించారు. కళా వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
యువతను డ్రగ్స్ పట్టిపీడిస్తోందని, మత్తు పదార్థాలతో జరిగే అనర్థాలను చాటే... నషా హీ నషా నాటకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించాలని సూచించారు.
రంగస్థల దర్శకులు రామ్ హోలగుండి, మంచాల రమేష్ టి.ఇందిరాదేవిలను సత్కరించారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్ అలేఖ్య పుంజాల తదితరులు పాల్గొన్నారు.


