ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి..రాత్రంతా! | UP Woman Kills Husband Sleeps Beside Corpse With Children At Night | Sakshi
Sakshi News home page

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి..రాత్రంతా!

Mar 30 2026 7:04 PM | Updated on Mar 30 2026 7:25 PM

UP Woman Kills Husband Sleeps Beside Corpse With Children At Night

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో జరిగిన ఒక ఘోర హత్య ఉదంతం కలకలం రేపింది. వివాహేతర  సంబంధానికి అడ్డు వస్తున్నాడని అక్కసుతో భర్తనే కడతేర్చింది.   ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది.

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లానికి  మెహ్రాజ్. తాపీ పనిచేసేవాడు. ఇతని భార్య రూహి. తన సొంత సోదరి బావ ఫర్మాన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ జంట కలిసి జీవించాలని కోరుకున్నారు.దీనిని మెహ్రాజ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది.  ప్రియుడితో కలిసి ప్లాన్‌ వేసింది. మెహ్రాజ్ ఆహారంలో మత్తుమందు కలిపి, ఆ తర్వాత రాత్రి సమయంలో ఫర్మాన్, అతని స్నేహితుడు అద్నాన్‌లను ఇంటికి పిలిపించింది.అందరూ కలిసి మెహ్రాజ్ కాళ్లను తాడుతో కట్టివేసి, పదునైన కత్తితో అతని గొంతు కోసి హత్య చేశారు. ఆ ఘోరమైన కృత్యం చేసిన తర్వాత, రూహి తన భర్త శవం పక్కనే ఉన్న మంచం మీద రాత్రంతా నిద్రపోయింది. ఆ తర్వాత ఇంట్లో దోపిడీ జరిగిందని కట్టుకథ అల్లింది.

ఇదీ చదవండి: వైభవంగా ఐపీఎస్‌ జంట వెడ్డింగ్‌ : ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ వైరల్‌

మరుసటి రోజు ఉదయం మెహ్రాజ్ తండ్రి తన కొడుకు ఇంటికి వచ్చినప్పుడు, అతని చేతులు, కాళ్లు ఇంకా కట్టేసి ఉన్న స్థితిలో, వరండాలోని మంచం మీద పడి ఉండటాన్ని చూశాడు. దీంతో  ఇదంతా దొంగల పని అని, ఎవరో దుండగులు వచ్చి తనపై దాడి చేశారని మొసలి కన్నీళ్లు కార్చింది. కానీ కోడలి మాటలపై అనుమానం వచ్చిన మెహ్రాజ్ తండ్రి పోలీసులకు సమాచారం అందించారు. ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, అసలు విషయం బయటపడింది.

పోలీసులు నిందితులైన రూహి, ఫర్మాన్ , అద్నాన్‌ను అరెస్ట్ చేశారు. హత్యకు పయోగించిన రెండు కత్తులతో పాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.  ముగ్గురినీ జైలుకు పంపారు, తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

ఇదీ చదవండి : ట్రంప్‌కు ఝలక్‌ : ఇరాన్‌ సుప్రీం కొత్త సందేశం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement