ట్రంప్‌కు ఝలక్‌ : ఇరాన్‌ సుప్రీం కొత్త సందేశం | Mojtaba Khamenei New Message Days After Trump comments | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు ఝలక్‌ : ఇరాన్‌ సుప్రీం కొత్త సందేశం

Mar 30 2026 4:00 PM | Updated on Mar 30 2026 4:40 PM

Mojtaba Khamenei New Message Days After Trump comments

ఇరాన్‌పై అమెరికా- ఇ‍జ్రాయెల్‌ ప్రకటించిన యుద్ధం, ఇరన్‌ ప్రతిదాడులు భీకరంగా  కొనసాగుతున్నాయి.  ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడిలో అప్పటి ఇరాన్‌ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన తర్వాత, ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ దాడిలో మోజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డాడని, అసలు ప్రాణాలతో లేడని ఇలా పలు ఊహాగానాలు చెలరేగాయి.  దీనిపై ఇరాన్‌ మోజ్తబా గాయపడినా,  ఆరోగ్యంగానే ఉన్నారని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఆయన ప్రజల ముందుకు రాలేదు.కేవలం లిఖితపూర్వక ప్రకటనలు మాత్రమే విడుదల చేస్తూ వస్తున్నారు. తాజాగా మరో సందేశాన్ని విడుదల చేశారు.  ప్రస్తుత యుద్ధంలో మద్దతుగా నిలిచినందుకు ఇరాక్ ప్రజలకు తమ నాయకుడు మొజ్తబా ఒక లిఖిత సందేశంలో కృతజ్ఞతలు తెలిపారని ఇరాన్ మీడియా మార్చి 29న తెలిపింది.

మొజ్తబా ఖమేనీ స్వయంగా కనిపించకపోవడంతో, ఆయన ఆరోగ్య పరిస్థితి మరియు ఆచూకీపై తీవ్ర పుకార్లు చెలరేగాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపే అంశంపై గత వారం మాట్లాడుతూ, తాము ఇరాన్‌లోని ఒక ముఖ్య వ్యక్తితో చర్చలు జరుపుతున్నామనీ కానీ అది సుప్రీం లీడర్‌తో  మాత్రం కాదు, ఆయన అసలు బతికి ఉన్నారో లేదో తెలియదని వ్యాఖ్యానించారు.

ట్రంప్ ఈ వ్యాఖ్యల తర్వాత మొజ్తబా ఖమేనీ కొత్త సందేశంప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా-ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్‌కు మద్దతుగా నిలిచినందుకు ఇరాక్ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఒక లేఖను విడుదల చేశారు. అలాగే ఇరాన్‌పై దురాక్రమణకు వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరిని తీసు కున్నందుకు ఇరాక్ సుప్రీం మత పెద్ద గ్రాండ్ అయతుల్లా అలీ సిస్తానీకి, అక్కడి ప్రజలకు ఇరాన్ పట్ల వారు చూపుతున్న మద్దతుకు మొజ్తబా కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి: వైభవంగా ఐపీఎస్‌ జంట వెడ్డింగ్‌ : ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ వైరల్‌

మోజ్తబా ఖమేనీ బయట కనిపించకపోవడంతో ఆయన ప్రాణాలతో ఉన్నారా లేదా అనే సందేహాలు తలెత్తాయి. అయితే, ఆయన వైమానిక దాడిలో గాయపడ్డారని, ప్రస్తుతం కోలుకుంటున్నారని ఇరాన్ అధికారులు మరియు ప్రభుత్వ మీడియా పేర్కొన్నాయి. కాగా 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత రూహోల్లా ఖొమేనీ మరియు అలీ ఖమేనీల తర్వాత మోజ్తబా ఖమేనీ ఇరాన్‌కు మూడవ సుప్రీం లీడర్ అయ్యారు.

ఇదీ చదవండి : రూ. 10 కోట్లు చూసి ఆమె షాక్‌ : నెటిజన్లు మాత్రం ఫిదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement