ఉప్పల్‌ చౌరస్తా మూసివేత.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇలా.. | Uppal Chow Rasta Closed Due To Road Construction | Sakshi
Sakshi News home page

ఉప్పల్‌ చౌరస్తా మూసివేత.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇలా..

May 17 2026 7:01 AM | Updated on May 17 2026 7:32 AM

Uppal Chow Rasta Closed Due To Road Construction

ఉప్పల్‌: అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్‌ చౌరస్తాను ఆదివారం నుంచి తాత్కాలికంగా మూసివేయనున్నారు. ఉప్పల్‌ విద్యుత్‌ జంక్షన్‌  ప్రాంతంలో ఎలివేటెడ్‌ కారిడార్‌ పిల్లర్‌ నిర్మాణ పనుల్లో భాగంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి ఉప్పల్‌ రింగ్‌ రోడ్‌ మీదుగా వరంగల్‌ వైపు వెళ్లే అన్ని రకాల వాహనాలను దారి మళ్లిస్తున్నా మని సూచించారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయం పక్కనున్న వరంగల్‌ బస్టాప్‌ను ఇప్పటికే ఉప్పల్‌ నల్ల చెరువు కట్ట వద్దకు మార్చిన విషయం విదితమే.  

ప్రత్యామ్నాయ మార్గాలు ఇలా.. 
హబ్సిగూడ నుంచి వరంగల్‌ వైపు వెళ్లే భారీ వాహనాలు హబ్సిగూడ చౌరస్తా నుంచి నాచారం, మల్లాపూర్, ఐవోసీ, చెంగిచర్ల మీదుగా వరంగల్‌ రహదారికి చేరుకోవాల్సి ఉంటుంది. చిన్న వాహనాలు ఉప్పల్‌ ఇందిరాగాంధీ పార్కునుంచి లిటిల్‌ ఫ్లవర్‌ వెనక  దారి నుంచి వరంగల్‌ రహదారికి చేరుకోవచ్చు. వరంగల్‌ నుంచి ఉప్పల్‌ వైపు వచ్చే వాహనాలు ఉప్పల్‌ ఏషియన్‌ సినీ థియేటర్‌ ఎదుటి హెచ్‌ఎండీఏ రోడ్డు ద్వారా నాగోల్‌ రోడ్డుకు కలుపుతారు. ద్విచక్ర వాహనదారులు నాగోల్‌ మెట్రో పిల్లర్లు 812, 813 నుంచి ఉప్పల్, సికింద్రాబాద్‌ వైపు వెళ్లాల్సి ఉంటుంది.  

అలాగే, భారీ వాహనాలు నాగోల్‌ బ్రిడ్జి కింద నుంచి యూ టర్న్‌ చేసుకుని తిరిగి ఉప్పల్‌ వైపు రావాలి. వరంగల్‌ వైపు వెళ్లేవారు హెచ్‌ఎండీఏ లే అవుట్‌ నుంచి వరంగల్‌ హైవేకు చేరుకోవాలి. హైదరాబాద్‌కు వచ్చే వరంగల్‌ బస్సులు, లారీలు, భారీ వాహనాలన్నీ ఓఆర్‌ఆర్‌ మీదుగా హయత్‌నగర్‌ మీదుగా నగరానికి చేరుకోవాల్సి ఉంటుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement