మాజీ సీఎం స్టాలిన్‌ సంచలన నిర్ణయం | Tamil Nadu Stalin Review On DMK Defeat In Elections | Sakshi
Sakshi News home page

మాజీ సీఎం స్టాలిన్‌ సంచలన నిర్ణయం

May 17 2026 7:21 AM | Updated on May 17 2026 7:34 AM

Tamil Nadu Stalin Review On DMK Defeat In Elections

అసెంబ్లీ ఎన్నికల్లో వైఫల్యం ఎందుకు?

నిష్పక్షపాతంగా నిజాలు చెప్పండి

క్షేత్ర పరిశోధన బృందానికి స్టాలిన్‌ ఆదేశం  

సాక్షి, చెన్నై: ఎన్నికల్లో  వైఫల్యం ఎందుకో? నిష్పక్షపాతంగా నిజాలు చెప్పండి అని క్షేత్ర పరిశోధన బృందానికి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ఆదేశించారు. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకే  కేవలం 59 సీట్లను మాత్రమే గెలుచుకుని ఊహించని పరాజయాన్ని చవిచూసింది. 

చాలా నియోజకవర్గాల్లో పార్టీ  అభ్యర్థులు రెండు, మూడో స్థానాలకు పరిమితమయ్యారు. చివరికి డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్‌ స్వయంగా తాను పోటీ చేసిన కొలత్తూరు నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. ఈ భారీ షాక్‌ తర్వాత, ఓటమికి గల అసలు కారణాలను విశ్లేషించడానికి డీఎంకే నాయకత్వం రంగంలోకి దిగింది.

క్షేత్రస్థాయి పరిశోధన బృందంతో స్టాలిన్‌ భేటీ 
పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్‌ నిర్మించేందుకు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌ 36 మంది సభ్యులతో కూడిన ఒక క్షేత్ర పరిశోధన బృందాన్ని ఏర్పాటు చేశారు. చెన్నైలో శనివారం ఈ బృందంతో ఆయన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు కనిమొళి, ఉదయనిధి స్టాలిన్‌ తదితరులు పాల్గొన్నారు.

నిజాలు మాత్రమే చెప్పండి 
ఇందులో స్టాలిన్‌ మాట్లాడుతూ.. పార్టీ సభ్యులు లేదా స్థానిక నిర్వాహకులు ఏం చెబుతున్నారనేది పక్కన పెడితే.. క్షేత్రస్థాయిలో ఉన్న అసలు నిజాలు ఏంటో తెలుసుకుని తనకు  నేరుగా చెపాలని కోరారు. నివేదికలో తనను  (డీఎంకే అధ్యక్షుడు) విమర్శించినా తప్పుగా అనుకోను. ఎవరినీ కాపాడటానికి ప్రయత్నించవద్దు అని సూచించారు. అలాగే ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనతో నివేదికలు ఇవ్వద్దు అని సూచించారు.  నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు, పరిశీలకులు , కార్యకర్తల నుంచి  సమాచారాన్ని సేకరించి జూన్‌ 5వ తేదీలోగా తుది నివేదికను సమర్పించాలని స్టాలిన్‌ కోరారు.    

Advertisement
 
Advertisement
Advertisement