వైభవంగా ఐపీఎస్‌ జంట వెడ్డింగ్‌ : ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ వైరల్‌ | IPS Anshika Sambhal SP Bishnoi Wedding Romantic Photos goes viral | Sakshi
Sakshi News home page

వైభవంగా ఐపీఎస్‌ జంట వెడ్డింగ్‌ : ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ వైరల్‌

Mar 30 2026 1:10 PM | Updated on Mar 30 2026 1:17 PM

IPS Anshika Sambhal SP Bishnoi Wedding Romantic Photos goes viral

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ప్రముఖ ఐపీఎస్ దంపతులు, కేకే బిష్ణోయ్ (K.K.Bishnoi) , అన్షికా వర్మ(IPS Anshika) వివాహం (2026 మార్చి 29)  వైభవంగా జరిగింది. ఈ రాజస్థాన్‌లోని బార్మర్‌లో వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.  జోధ్‌పూర్‌లో రిసెప్షన్‌కోసం రెడీ అవుతున్నారు. సంభాల్ ఎస్పీ ఐపీఎస్ కేకే బిష్ణోయ్  అన్షికా వర్మల వివాహం సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా నిలిచింది. తాజగా ఐపీఎస్ అన్షికా వర్మ తన ప్రీ-వెడ్డింగ్షూట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.  లవ్‌ బర్డ్స్‌కు చెందిన రొమాంటిక్‌ ఫోటోలు నెటిజనులను  బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఐపీఎస్‌ లవ్‌ స్టోరీ
ఐపీఎస్ ఆఫీసర్లు కేకే బిష్ణోయ్ , ఐపీఎస్ అన్షికా వర్మ 2023లో కలుసుకున్నారు.  ఆ పరిచయం కాస్తా ప్రేమగా మరింది. ఆ తర్వాత వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మార్చి 26న ఈ లవ్‌బర్డ్స్‌ ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకున్నారు. హల్దీ , మెహందీ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ జంట మార్చి 29న బార్మర్‌లో వివాహ తరువాత మార్చి 30న జోధ్‌పూర్‌లో పలువురు వీఐపీల సమక్షంలో ఒక రిసెప్షన్ జరగనుంది. యూపీలో యంగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్ అధికారులుగా పేరు తెచ్చుకున్న ఇద్దరి ప్రేమకథ వైరల్ అవుతోంది. సంభాల్ హింస తర్వాత నేరస్తులపై కఠిన చర్యలు తీసుకొన్న డైనమిక్ బిష్ణోయ్  సీఎం మెడల్‌ అందున్నారు. రూ. 100 కోట్ల విలువైన బీమా కుంభకోణం బయటపెట్టి, 69 మందికి పైగా మాఫియాను కటకటాల వెనక్కి నెట్టారు.  రౌడీ గ్యాంగ్‌లకు,  అల్లరిమూకలకు చుక్కటు చూపించి  ‘‘లేడీ సింగం’’గా అన్షికా వర్మ పేరు తెచ్చుకున్నారు.
 

ఐపీఎస్ అధికారిణి,లేడీ సింగం అన్షిక వర్మ
ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందినవారు
తండ్రి రిటైర్డ్ యూపీపీసీఎల్ ఇంజనీర్
బీ.టెక్  తరువాత, కోచింగ్ లేకుండా యూపీఎస్సీలో ఉత్తీర్ణత 
2021 బ్యాచ్ ఐపీఎస్ అధికారి
ప్రస్తుతం బరేలీలో ఎస్పీ సౌత్‌గా పనిచేస్తున్నారు
గోరఖ్‌పూర్‌లో ఏఎస్పీగా కూడా పనిచేశారు

ఇదీ చదవండి: రైతుకు రూ.15 కోట్ల పరిహారం: హెలికాప్టర్, థాయ్‌లాండ్ ట్రిప్‌
 

ఐపీఎస్ కేకే బిష్ణోయ్ 
రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా నివాసి
పూర్తి పేరు కృష్ణ కుమార్ బిష్ణోయ్
రైతు కుటుంబానికి చెందినవారు
ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుండి బీఏ పట్టా పొందారు
24 ఏళ్ల వయసులో యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించారు
2018 బ్యాచ్ ఐపీఎస్ అధికారి
ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లోని సంభాల్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు
గతంలో ముజఫర్‌నగర్‌లో ఏఎస్పీగా పనిచేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement