ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జేవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించారు. ఇది ఉత్తర ప్రదేశ్‌కు ఒక ప్రధాన మౌలిక సదుపాయాల మైలురాయిగా నిలిచింది. అయితే దీనికి సంబంధించి సేకరించిన భూములకు భారీగా పరిహారం అందినట్టు తెలుస్తోంది. తద్వారాఉత్తరప్రదేశ్ రైతుల జీవితాలు రాత్రికి రాత్రే మారిపోయాయని పలు నివేదిల సమాచారం
'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' కథనం ప్రకారం నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ భూసేకరణలో భాగంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ఒక రైతుకు దాదాపు రూ.15 కోట్ల పరిహారం అందింది. ఈ భారీ సొమ్ముతో ఆయన ఏకంగా ఒక హెలికాప్టర్‌ను కొనుగోలు చేయడమే కాకుండా, విహారయాత్ర కోసం థాయ్‌లాండ్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడట.
ఈ విమానాశ్రయ ప్రాజెక్టు వల్ల గ్రామీణ ముఖచిత్రం మారుతోందట. ఆ ప్రాంతంలోని అనేక కుటుంబాల ఆర్థిక స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి. వారి ఆశలు, ఆకాంక్షలు ఎలా నెరవేరుతున్నాయి ఈ కథనం పేర్కొంది. ఉదాహరణకు ఈ క్రింది వివరాలు చూద్దాం.
శివమ్ ప్రజాపతి : బన్వారీ బాస్ గ్రామానికి చెందిన ఈ యువకుడు శివమ్ ప్రజాపతి (26) ఇప్పుడు ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ మరియు సోలార్ ప్లాంట్‌కు లేబర్‌ను సరఫరా చేసే సబ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. పెరిగిన ఆదాయంతో తన స్నేహితులతో కలిసి థాయ్‌లాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు తనకు ఇది ఊహకందని విషయం అని ఆయన చెబుతున్నారు.
అజయ్ బేనివాల్: కిశోర్‌పూర్ గ్రామానికి చెందిన అజయ్ ఒకప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవాడు ఇప్పుడు విమానాశ్రయ పనులకు వచ్చే కూలీలు తమ హెల్మెట్లు, తాళాలు భద్రపరుచుకునే చిన్న సర్వీస్ సెంటర్‌ను నడుపుతూ నెలకు రూ.60వేలు సంపాదిస్తున్నాడు.
(ఆలయంలో ప్రీ-వెడ్డింగ్ షూట్ వివాదం : కెమెరామెన్లపై దాడి)
56 ఏళ్ల నానక్ చంద్ : వలస కూలీలకు అద్దెకు ఇవ్వడం కోసం తన ఇంట్లో ఆరు అదనపు గదులను నిర్మించాడు. ఒకప్పుడు మంచి ఆదాయం వచ్చినా, ప్రస్తుతం విమానాశ్రయ నిర్మాణం చివరి దశకు చేరుకోవడంతో కూలీల సంఖ్య తగ్గి గదులు ఖాళీగా ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో చర్చ
అయితే దీనిపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రాజకీయ నాయకులకు, బడాబాబులకు హెలికాప్టర్ ఒక స్టేటస్ సింబల్. కానీ రైతు కూడా అదే అనుభవించాలని అనుకుంటున్నాడా అని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని ముల్షీ ప్రాంత విషయాన్ని గుర్తు చేస్తూ.. గతంలో ఇలాగే పరిహారం వచ్చిన వారు విలాసవంత మైన కార్లు కొని, ఆ తరువాత కొన్నేళ్లకే పెట్రోల్ పోయించుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డారు. పరిహారం సొమ్మును తెలివిగా పెట్టుబడి పెట్టకపోతే భవిష్యత్తులో కష్టాలు తప్పవని మరో యూజర్ హెచ్చరించారు.
ఇదీ చదవండి: యువతి కారుణ్య మరణం, చివరి కోరిక తెలిస్తే కన్నీళ్లాగవు


