IPS couple
-
ఆ ఐపీఎస్ జంట వివాహంలో..హాట్‌టాపిక్‌గా ఆ ఆచారం!
మన దేశంలో పెళ్లికి సంబంధించి ప్రాంతాల వారీగా విభిన్న ఆచారాలు ఉన్నాయి. ఇటీవల మార్చి 29న వైవాహిక బంధంతో ఒక్కటైన ఐపీఎస్ జంట పెళ్లి వేడుకలో జరిగిన ‘దూద్ పిలాయ్’ తంతు అందరి దృష్టిని ఆకర్షించడమే గాక చర్చనీయాంశంగా మారింది. పెళ్లికొడుకు ఊరేగింపునకు ముందు జరిపే ఈ తంతు అత్యంత విలక్షణంగా ఉండటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో దూద్ పిలాయ్ అంటే ఏంటి? ఎందుకు నిర్వహిస్తారో సవివరంగా తెలుసుకుందామా..!.రాజస్థాన్‌లోని భార్మర్కు చెందిన ఐపీఎస్ అధికారి బిష్ణోయ్ మార్చి 29న జోధ్‌పూర్ ఐపీఎస్ అధికారి అన్షిక వర్మను వివాహం చేసుకున్నారు. ఐపీఎస్ ఆఫీసర్లు కేకే బిష్ణోయ్ , ఐపీఎస్ అన్షికా వర్మ 2023లో కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మరింది. ఆ తర్వాత వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ జంట పెళ్లిలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్ర పెళ్లికొడుకు ఊరేగింపు వేడుకలో జరిగిన తంతు. ఇక్కడ ఐపీఎస్ అధికారి దూద్ పిలాయ్ ఆ ఆచారంలో పాల్గొనడం. అందుకు సంబంధించిన వీడియోలో నెట్టింట వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా ఈ తంతుపై ఆసక్తిని రేకెత్తించింది. ‘దూద్ పిలాయ్’ అంటే..దూద్ పిలాయ్ అనేది రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో పాటించే ఒక సాంప్రదాయ ఆచారం. ఇక్కడ తల్లి తనపల్లు (కొంగు) కింద నుండి కొడుకుకు ప్రతీకాత్మకంగా పాలు ఇచ్చి, ఆశీర్వదించి, బాధ్యతలను గుర్తుచేస్తుంది. ఇది భావోద్వేగపూరితమైన సంప్రదాయం. ఇది కేవలం ప్రతీకాత్మకమైన చర్య. తల్లి కొంగు కింద పాలు తినిపించడం ద్వారా తన పాలు ఇచ్చి పెంచిన ప్రేమను, ఆశీర్వాదాన్ని అందిస్తుంది. కొడుకు చిన్నతనం నుంచి, వైవాహిక బాధ్యతల్లోకి ప్రవేశిస్తున్నాడని, అతనికి ఆ తల్లి ఆశీస్సులు సదా ఉంటాయని సూచిస్తుంది. ఈ ఆచారం పూర్వకాలం నాటిదట. ఒకప్పుడూ పురాతన కాలంలో, సైనికులు యుద్ధభూమికి వెళ్లే ముందు తల్లి ప్రేమను గుర్తుచేసుకోవడానికి, తల్లి పాలకు గౌరవం ఇస్తూ ఈ ఆచారాన్ని ఆచరించేవారని చెబుతున్నారు చరిత్రకారులు. ఈ ఆచారాన్ని ఎక్కువగా హర్యానా, బీహార్, పశ్చిమ నేపాల్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఆచారిస్తారట. View this post on Instagram A post shared by Mo (@mo.of.everything) (చదవండి: ఐఐటీ,గేట్లలో టాపర్, పీహెచ్డీ పట్టభద్రుడు కానీ..!) -
వైభవంగా ఐపీఎస్ జంట వెడ్డింగ్ : ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ప్రముఖ ఐపీఎస్ అధికారులు కేకే బిష్ణోయ్ (K.K.Bishnoi) , అన్షికా వర్మ(IPS Anshika) వివాహం (2026 మార్చి 29) వైభవంగా జరిగింది. రాజస్థాన్‌లోని బార్మర్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. జోధ్‌పూర్‌లో రిసెప్షన్ కోసం రెడీ అవుతున్నారు. కేకే బిష్ణోయ్ అన్షికా వర్మల వివాహం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. తాజగా ఐపీఎస్ అన్షికా వర్మ తన ప్రీ-వెడ్డింగ్షూట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. లవ్ బర్డ్స్‌కు చెందిన రొమాంటిక్ ఫోటోలు నెటిజనులను బాగా ఆకట్టుకుంటున్నాయి.ఐపీఎస్ లవ్ స్టోరీఐపీఎస్ ఆఫీసర్లు కేకే బిష్ణోయ్ , ఐపీఎస్ అన్షికా వర్మ 2023లో కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మరింది. ఆ తర్వాత వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మార్చి 26న ఈ లవ్‌బర్డ్స్ ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకున్నారు. హల్దీ, మెహందీవేడుకలనుఘనంగా నిర్వహించు కున్నారు. ఈ జంట మార్చి 29న వివాహం తరువాత మార్చి 30న జోధ్‌పూర్‌లో పలువురు వీఐపీల సమక్షంలో రిసెప్షన్ జరగనుంది. View this post on Instagram A post shared by Anshika Verma (@anshikaverma.ips) యూపీలో యంగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్ అధికారులుగా పేరు తెచ్చుకున్న ఇద్దరి ప్రేమకథ వైరల్ అవుతోంది. సంభాల్ హింస తర్వాత నేరస్తులపై కఠిన చర్యలు తీసుకొన్న డైనమిక్ బిష్ణోయ్ సీఎం మెడల్ అందున్నారు. రూ. 100 కోట్ల విలువైన బీమా కుంభకోణం బయటపెట్టి, 69 మందికి పైగా మాఫియాను కటకటాల వెనక్కి నెట్టారు. రౌడీ గ్యాంగ్‌లకు, అల్లరిమూకలకు చుక్కలు చూపించి ‘‘లేడీ సింగం’’గా అన్షికా వర్మ పేరు తెచ్చుకున్నారు. SP कृष्ण बिश्नोई - SP अंशिका बिश्नोई का #विवाह सम्पूर्ण #बिश्नोई_समाज के रीति रिवाज़ द्वारा हुआ सम्पन्न #KKBishnoi#AnshikaVerma#IPSWedding#IPSWedding#WeddingVibes#ipsanshikaverma#IPSOfficer#SPKKBishnoi#SambhalSp#NewsFlash https://t.co/46TU4SFLE1 pic.twitter.com/tPQfkatl3P— Goldy Srivastav (@GoldySrivastav) March 30, 2026ఐపీఎస్ అధికారిణి,లేడీ సింగం అన్షిక వర్మఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందినవారుతండ్రి రిటైర్డ్ యూపీపీసీఎల్ ఇంజనీర్బీ.టెక్ తరువాత, కోచింగ్ లేకుండా యూపీఎస్సీలో ఉత్తీర్ణత 2021 బ్యాచ్ ఐపీఎస్ అధికారిప్రస్తుతం బరేలీలో ఎస్పీ సౌత్‌గా పనిచేస్తున్నారుగోరఖ్పూర్లో ఏఎస్పీగా కూడా పనిచేశారుఇదీ చదవండి: రైతుకు రూ.15 కోట్ల పరిహారం: హెలికాప్టర్, థాయ్‌లాండ్ ట్రిప్ ఐపీఎస్ కేకే బిష్ణోయ్ రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా నివాసిపూర్తి పేరు కృష్ణ కుమార్ బిష్ణోయ్రైతు కుటుంబానికి చెందినవారుఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుండి బీఏ పట్టా పొందారు24 ఏళ్ల వయసులో యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించారు2018 బ్యాచ్ ఐపీఎస్ అధికారిప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లోని సంభాల్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారుగతంలో ముజఫర్‌నగర్‌లో ఏఎస్పీగా పనిచేశారు -
వ్యభిచారాన్ని చట్టబద్దం చేయాలన్న ఐపీఎస్ దంపతులు
వ్యభిచారాన్ని చట్టబద్దం చేయాలని ఐపీఎస్ దంపతులు వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది. గోవాలో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులు ప్రియాంక, కార్తీక్ కశ్యప్ భార్యాభర్తలు. ఇటీవల పనాజీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ జంట.. రాష్ట్రంలో వ్యభిచారాన్ని చట్టబద్దం చేయాలని అన్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆ తర్వాత వివరణ ఇచ్చారు. ఇది తమ వ్యక్తిగత అభిప్రాయమేనని ఐపీఎస్ దంపతులు తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు. ఇంతకుముందు కూడా గోవాలో ఇలాంటి సంఘటనే జరిగింది. బార్ డాన్సర్లకు మద్దతుగా ఓ బీజేపీ నాయకుడు మాట్లాడి ఆనక నాలుక్కరుకున్నాడు. ఆయన కూడా వ్యక్తిగత అభిప్రాయమంటూ వివరణ ఇచ్చుకున్నారు.


