ఆ ఐపీఎస్‌ జంట వివాహంలో..హాట్‌టాపిక్‌గా ఆ ఆచారం! | IPS officers wedding in Rajasthan What Is ‘Doodh Pilai | Sakshi
Sakshi News home page

ఆ ఐపీఎస్‌ జంట వివాహంలో..హాట్‌టాపిక్‌గా ‘దూద్ పిలాయ్’ ఆచారం!

Apr 9 2026 3:41 PM | Updated on Apr 9 2026 4:02 PM

IPS officers wedding in Rajasthan What Is ‘Doodh Pilai

మన దేశంలో పెళ్లికి సంబంధించి ప్రాంతాల వారీగా విభిన్న ఆచారాలు ఉన్నాయి. ఇటీవల మార్చి 29న వైవాహిక బంధంతో ఒక్కటైన ఐపీఎస్‌ జంట పెళ్లి వేడుకలో జరిగిన ‘దూద్ పిలాయ్’ తంతు అందరి దృష్టిని ఆకర్షించడమే గాక చర్చనీయాంశంగా మారింది. పెళ్లికొడుకు ఊరేగింపునకు ముందు జరిపే ఈ తంతు అత్యంత విలక్షణంగా ఉండటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో దూద్‌ పిలాయ్‌ అంటే ఏంటి? ఎందుకు నిర్వహిస్తారో సవివరంగా తెలుసుకుందామా..!.

రాజస్థాన్‌లోని భార్మర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి బిష్ణోయ్‌ మార్చి 29న జోధ్‌పూర్‌ ఐపీఎస్‌ అధికారి అన్షిక వర్మను వివాహం చేసుకున్నారు. ఐపీఎస్ ఆఫీసర్లు కేకే బిష్ణోయ్ , ఐపీఎస్ అన్షికా వర్మ 2023లో కలుసుకున్నారు.  ఆ పరిచయం కాస్తా ప్రేమగా మరింది. ఆ తర్వాత వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 

ఈ జంట పెళ్లిలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్ర పెళ్లికొడుకు ఊరేగింపు వేడుకలో జరిగిన తంతు. ఇక్కడ ఐపీఎస్‌ అధికారి దూద్‌ పిలాయ్‌ ఆ ఆచారంలో పాల్గొనడం. అందుకు సంబంధించిన వీడియోలో నెట్టింట వైరల్‌ అవ్వడంతో ఒక్కసారిగా ఈ తంతుపై ఆసక్తిని రేకెత్తించింది. 

‘దూద్ పిలాయ్’ అంటే..
దూద్ పిలాయ్ అనేది రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో పాటించే ఒక సాంప్రదాయ ఆచారం. ఇక్కడ తల్లి తనపల్లు (కొంగు) కింద నుండి కొడుకుకు ప్రతీకాత్మకంగా పాలు ఇచ్చి, ఆశీర్వదించి, బాధ్యతలను గుర్తుచేస్తుంది. ఇది భావోద్వేగపూరితమైన సంప్రదాయం.  

ఇది కేవలం ప్రతీకాత్మకమైన చర్య. తల్లి కొంగు కింద పాలు తినిపించడం ద్వారా తన పాలు ఇచ్చి పెంచిన ప్రేమను, ఆశీర్వాదాన్ని అందిస్తుంది. కొడుకు చిన్నతనం నుంచి, వైవాహిక బాధ్యతల్లోకి ప్రవేశిస్తున్నాడని, అతనికి ఆ తల్లి ఆశీస్సులు సదా ఉంటాయని సూచిస్తుంది. 

ఈ ఆచారం పూర్వకాలం నాటిదట. ఒకప్పుడూ పురాతన కాలంలో, సైనికులు యుద్ధభూమికి వెళ్లే ముందు తల్లి ప్రేమను గుర్తుచేసుకోవడానికి, తల్లి పాలకు గౌరవం ఇస్తూ ఈ ఆచారాన్ని ఆచరించేవారని చెబుతున్నారు చరిత్రకారులు. ఈ ఆచారాన్ని ఎక్కువగా హర్యానా, బీహార్, పశ్చిమ నేపాల్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఆచారిస్తారట. 

 

(చదవండి: ఐఐటీ,గేట్‌లలో టాపర్‌, పీహెచ్‌డీ పట్టభద్రుడు కానీ..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement