‘గాంధీ’కి మరో నాలుగు ఫ్రీజర్‌ బాక్సులు | - | Sakshi
Sakshi News home page

‘గాంధీ’కి మరో నాలుగు ఫ్రీజర్‌ బాక్సులు

Mar 21 2026 6:40 AM | Updated on Mar 21 2026 6:40 AM

గాంధీఆస్పత్రి : సికింద్రాబాద్‌ గాంధీ మార్చురీకి అదనంగా మరో నాలుగు ఫ్రీజర్‌ బాక్సులు వచ్చాయి. తెలంగాణ వైద్యవిద్య మౌళిక సదుపాయాల కల్పన సంస్థ (టీజీఎంఎస్‌ఐడీసీ) నుంచి ఇవి గాంధీ మార్చురీకి శుక్రవారం చేరుకున్నాయి. గాంధీ’లో పనిచేయని ఫ్రీజర్లు శీర్షికతో ఇటీవల ‘సాక్షి’ ప్రచురించిన కఽథనానికి వైద్యమంత్రితోపాటు ఉన్నతాధికారులు స్పందించారు. గాంధీ మార్చురీలో 70 మృతదేహాలను భద్రపర్చేందుకు ఫ్రీజరు బాక్సులు ఉండగా, వీటిలో 44 పనిచేయకపోవడంతో కుళ్లిన మృతదేహాలు తీవ్ర దుర్గంధం వెదజల్లుతుండటంతో వైద్యులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఫ్రీజర్ల కాల పరిమితి ముగిసిందని, మరమ్మత్తులకు కూడా పనికిరావని ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించింది.దీంతో స్పందించిన ప్రభుత్వం అదనపు ఫ్రీజర్‌ బాక్సులు గాంధీ ఆస్పత్రికి పంపింది.

Advertisement
 
Advertisement
Advertisement