ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..? | Weekly Horoscope Telugu 29-03-26 To 04-04-2026 | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Mar 29 2026 5:12 AM | Updated on Mar 29 2026 5:12 AM

Weekly Horoscope Telugu 29-03-26 To 04-04-2026

మేషం...
కొంత జాప్యం జరిగినా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకూ అనుకూలిస్తుంది. బంధువుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థుల ప్రతిభ నిరూపించుకుంటారు. ఆస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు సఫలమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు పనిభారం కొంతమేర తగ్గే సూచనలు. క్రీడాకారులు,  రాజకీయవర్గాలకు కొత్త అవకాశాలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. పనిఒత్తిడులు. ఖర్చులు. గులాబీ,  నేరేడు రంగులు, హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

వృషభం...
ఎంతటి పనినైనా నేర్పుగా పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆదాయం సంతృప్తినిస్తుంది. రావలసిన సొమ్ము అందుతుంది. కాంట్రాక్టులు పొందుతారు. వివాహ వేడుకల్లో పాల్గొంటారు. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు తీపికబురు అందుతుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో దూరప్రయాణాలు. ఒప్పందాలలో మార్పులు.  అనారోగ్య సూచనలు. ఎరుపు, నేరేడు రంగులు,. దేవీస్తోత్రాలు పఠించండి.

మిథునం....
ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయటా ఒత్తిడులు ఎదురవుతాయి. సోదరులు, సోదరీలతో విభేదాలు. అనుకున్న పనులు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొంత నిరాశాజనకంగా ఉంటుంది. చిరకాల మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళాకారులకు అవకాశాలు నిరాశకలిగిస్తాయి. వారం మధ్యలో శుభవార్తలు. ధనలాభం. నీలం, లేత ఆకుపచ్చ రంగులు,  విష్ణుధ్యానం చేయండి.

కర్కాటకం...
వీరికి అన్నీ శుభదాయకమే. ముఖ్యమైన కార్యక్రమాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రాబడి పెరుగుతుంది. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. కళాకారులకు విశేష గుర్తింపు. . వారం చివరిలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. నలుపు, ఆకుపచ్చ రంగులు,  రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

సింహం...
చేపట్టిన కార్యక్రమాలు నెమ్మదిగా కొనసాగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సోదరులు, సోదరీల నుంచి సహాయం అందుతుంది. ఇంతకాలం వేధించిన సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. భూవివాదాలు తీరతాయి. ఆదాయం సంతృప్తినిస్తుంది. ఇంటాబయటా ఒత్తిడులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగస్తులకు మార్పులు అనివార్యం కావచ్చు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం  ప్రారంభంలో వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు,  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కన్య...
అతి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు నూతనోత్సాహం. పరిచయాలు పెరుగుతాయి. ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు కొన్ని వెసులుబాట్లు లభిస్తాయి. కళాకారులకు అప్రయత్న కార్యసిద్ధి.  వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. గులాబీ, లేత పసుపు రంగులు, కనకధారాస్తోత్రం పఠించండి.

తుల..
ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు కొంతవరకూ పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామి నుంచి ఆస్తిలాభం ఉండవచ్చు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి. క్రీడాకారులు, కళాకారులకు సన్మానయోగం. వారం చివరిలో మానసిక ఆవేదన, ఆరోగ్యభంగం. వ్యయప్రయాసలు. గులాబీ, తెలుపు రంగులు,  గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం...
ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు మరింత పనిభారం నుండి విముక్తి. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో సన్నిహితులతో వివాదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. నీలం, నేరేడురంగులు,  శివపంచాక్షరి పఠించండి.

ధనుస్సు...
అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు  శ్రమపడాల్సిన సమయం. ఆర్థిక పరిస్థితి క్రమేపీ మెరుగుపడుతుంది. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపండి. వేడుకల్లో పాల్గొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. పనులు కొన్ని నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపార లావాదేవీలు కాస్త పుంజుకుంటాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గే సూచనలు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. బంధువిరోధాలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు, దుర్గాదేవిని పూజించండి.

మకరం...
అనుకున్న వ్యవహారాలు కొంత నెమ్మదిస్తాయి. ఆదాయం కొంత తగ్గినా అవసరాలకు సొమ్ము అందుతుంది. బంధువులు, మిత్రులతో కొన్ని విషయాలలో ఏకీభవిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. విద్యార్థుల యత్నాలు సఫలం. ఆస్తి వివాదాలు కొంతమేరకు పరిష్కారం. శుభవార్తలు అందుతాయి. వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు అభివృది ్ధదిశగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఆశించిన మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు తథ్యం. వారం మధ్యలో వివాదాలు. ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, తెలుపు రంగులు,. శివస్తోత్రాలు పఠించండి.

కుంభం...
అనుకున్న పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రావలసిన సొమ్ము సైతం అందుతుంది. మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ముఖ్య నిర్ణయాలలో లోపాలను సరిదిద్దుకుంటారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు తొలగుతాయి. ఉద్యోగలాభం. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు కీలక పోస్టులు దక్కవచ్చు. క్రీడాకారులు, కళాకారులకు ఊహించని అవకాశాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో స్వల్ప వివాదాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు,  ఆంజనేయ దండకం పఠించండి.

మీనం...
కొత్త  పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సంఘంలో విశేష ఆదరణ పొందుతారు. బంధువులు, శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు దక్కుతాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులు సత్తా నిరూపించుకుంటారు. కళాకారులకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. అనుకోని ప్రయాణాలు. పసుపు, లేత ఎరుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement