నుమాయిష్ ఓ బ్రాండ్
అబిడ్స్: నగరంలో నిర్వహించే నుమాయిష్ ఓ బ్రాండ్ అని, చార్మినార్, గోల్కొండ, హైదరాబాద్ బిర్యానీ మాదిరిగానే ప్రపంచ వ్యాప్తంగా నాంపల్లి ఎగ్జిబిషన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని రాష్ట్ర టూరిజం, ఎకై ్సజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలకు వారి ఉత్పత్తులను ప్రదర్శించేందుకు ఎగ్జిబిషన్ ఒక నిలయంగా మారిందన్నారు. గురువారం రాత్రి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. హైదరాబాద్ సిటీ కాస్మో పాలిటన్ సిటీగా మారిందన్నారు. భారతదేశంలోని అన్ని భాషల ప్రజలు కలిసి మెలిసి ఉండి వ్యాపారాలు, పారిశ్రామిక ప్రదర్శనలు చేసేందుకు ఎగ్జిబిషన్ ఎంతో దోహద పడుతుందన్నారు. నుమాయిష్‌ను 20 లక్షల మంది సందర్శించడం గొప్ప విషయమని, ఇంతటి ప్రాముఖ్యత కలిగిన నుమాయిష్‌లో సాంస్కృతిక, పర్యాటకాన్ని కూడా ప్రమోట్ చేయాలని సూచించారు.
● నుమాయిష్ నుంచి వచ్చే దాదాపు రూ.30 కోట్ల ఆదాయాన్ని విద్యావ్యాప్తి కోసం వెచ్చి స్తుండటం అభినందనీయమన్నారు. అనంతరం ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు సుఖేష్‌రెడ్డి స్వాగతోపన్యాసం చేయగా కార్యదర్శి బీఎన్ రాజేశ్వర్ నివేదిక సమర్పించారు. బహు మతుల ప్రధానోత్సవ సబ్ కమిటీ సలహాదారుడు హరినాథ్‌రెడ్డి వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ సంయుక్త కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి డాక్టర్ సంజీవ్‌కుమార్, కన్వీనర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు. జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రాతో పాటు పలు శాఖల అధికారులు, స్టాల్ హోల్డర్లకు మంత్రి బహుమతులు అందజేశారు.


