ఆదాయంహైరైజ్‌ | - | Sakshi
Sakshi News home page

ఆదాయంహైరైజ్‌

Feb 13 2026 5:35 AM | Updated on Feb 13 2026 5:35 AM

ఆదాయంహైరైజ్‌

ఆదాయంహైరైజ్‌

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) నుంచే బహుళ అంతస్తుల భవనాలు, లే అవుట్లు, నిర్మాణ రంగ అనుమతులు లభించనుండటంతో.. కొత్తగా అవతరించిన మున్సిపల్‌ కార్పొరేషన్‌లు, హెచ్‌ఎండీఏ మధ్య డెలిగేషన్‌ ఆఫ్‌ వపర్స్‌ (అధికారాల బదిలీ)లో స్పష్టత వచ్చినట్లయింది. ఓటర్‌ వరకు విస్తరిత మూడు మున్సిపల్‌ కార్పొరేషన్‌ల పరిధిలో పది అంతస్తుల భవనాల వరకు మున్సిపల్‌ కార్పొరేషన్‌ల నుంచే అనుమతులను అందజేస్తారు. పదకొండో అంతస్తు నుంచి నిర్మించే వాటికి హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులను పొందాల్సి ఉంటుంది. మున్సిపల్‌ కార్పొరేషన్‌లతో పాటు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న ట్రిబుల్‌ ఆర్‌ వరకు లే అవుట్‌ అనుమతులను కూడా హెచ్‌ఎండీఏ నుంచే అందజేస్తారు. ప్రస్తుతం రీజినల్‌ రింగ్‌ రోడ్డు వరకు రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, ఫ్లైఓవర్‌లు, ఎలివేటెడ్‌ కారిడార్‌లు, గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్లు తదితర ప్రాజెక్టులను హెచ్‌ఎండీఏ చేపట్టింది.

ఆ రెండింటితో ఏటా రూ.1200 కోట్లు..

హెచ్‌ఎండీఏ ప్రణాళికా విభాగం ఇచ్చే నిర్మాణ అనుమతులు, లే అవుట్‌ల ద్వారానే ఏటా రూ.1200 కోట్లకు పైగా ఆదాయం లభిస్తోంది. భూములు, సొంత లే అవుట్‌ల విక్రయంతో వచ్చే రాబడీ కీలకమే. ఈ రెండు ఆదాయ మార్గాలను దృష్టిలో ఉంచుకొనే నగరంలో ఎలివేటెడ్‌ కారిడార్లు, ఫ్లైఓవర్లు, గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఈ ఆదాయ మార్గాలనే బ్యాంకు రుణాలను చెల్లించేందుకు గ్యారంటీలుగా చూపుతూ రూ.30 వేల కోట్ల రుణాల సేకరణకు చర్యలు చేపట్టింది.

కొత్త ప్రాజెక్టులు ఇవే..

బుద్వేల్‌ ఇంటర్‌చేంజ్‌ ట్రంపెట్‌ రోడ్డుకు రూ.488 కోట్లతో ప్రణాళికలకు రూపకల్పన. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–12లోని ఐసీసీసీ నుంచి శిల్పా లేఅవుట్‌ వరకు రూ.1656 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌. శంకర్‌పల్లి రోడ్‌లోని ఎంజీఐటీ నుంచి మణికొండ వరకు 3.57 కి.మీ పొడవున పైపులైన్‌ రోడ్డు అభివృద్ధికి రూ.110 కోట్లు. నానక్‌రామ్‌గూడ నుంచి గచ్చిబౌలి వరకు ఓఆర్‌ఆర్‌కు ఎడమవైపున రహదారి విస్తరణ చేపట్టనున్నారు. 75 మీటర్ల రైట్‌ ఆఫ్‌ వేత్‌ (ఆర్‌ఓడబ్ల్యూ)తో రూ.26.50 కోట్లతో చేపట్టనున్నారు. సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ నుంచి డెయిరీఫామ్‌ వరకు రూ.1,650 కోట్లతో చేపట్టిన ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు కొనసాగుతున్నాయి. జేబీఎస్‌ నుంచి శామీర్‌పేట్‌ వరకు రూ.2,500 కోట్లతో చేపట్టనున్న స్టీల్‌ బ్రిడ్జి ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.

భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులతో భారీ నిధులు

అధికారాల బదిలీతో మరింత బలోపేతం

బాండ్‌ల రూపంలో రూ.30 వేల కోట్ల సేకరణ

నగరాభివృద్ధిలో హెచ్‌ఎండీఏది కీలకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement