ట్రావెల్ బ్యాగులో కుక్కి..గోదావరిలో పారవేసి..
బంగారం, నగదు కోసం ఇంటి యజమానురాలి దారుణ హత్య
మల్లాపూర్: ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి నగదు, బంగారం, కోసం ఒంటరిగా ఉంటున్న ఇంటి యజమానురాలిని దారుణంగా హత్య చేశాడు. ఆపై ఇద్దరు స్నేహితుల సహాయంతో మృతదేహాన్ని గోదావరి నదిలో పారవేసిన సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నాచారం ఇన్‌స్పెక్టర్ ధనుంజయ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..మల్లాపూర్ బాబానగర్‌కు చెందిన సూరెడ్డి సుజాత (65) కనిపించడం లేదని బంధువుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాచారం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా, పెరవెల్లి మండలం, కొత్తపల్లి గ్రామానికి చెందిన మద్దు అంజిబాబు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రెండు నెలల క్రితం అతను మల్లాపూర్ బాబానగర్‌లో సూరెడ్డి సుజాత ఇంట్లో అద్దెకు దిగాడు. ఒంటరిగా ఉంటున్న యజమానురాలి వద్ద పెద్ద మొత్తంలో బంగారం, నగదు ఉన్నట్లు గుర్తించిన అతను వాటిని కాజేసేందుకు కుట్ర పన్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 19న ఆమె గొంతు నులిమి హత్య చేసి నగదు, బంగారు ఆభరణాలను దోచుకున్నాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ట్రావెల్ బ్యాగ్‌లో మృతదేహాన్ని భద్రపరిచాడు.
స్నేహితుల సహాయంతో గోదావరి నదిలో పారవేత..
తన స్నేహితులైన కోనసీమ జిల్లాకు చెందిన నక్కటి యువరాజు, నూకల దుర్గా రావు సహాయంతో సుజాత మృతదేహాన్ని కారులో కోనసీమ జిల్లా పరిధిలోని గోదావరి నదికి తీసుకెళ్లి కృష్ణలంక వద్ద నదిలో మృతదేహాన్ని పారవేశారు.
సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు..
సూరెడ్డి సుజాత మిస్సింగ్ కేసుపై దర్యాప్తు చేపట్టిన నాచారం పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా ఇంట్లో అద్దెకు ఉంటున్న మడ్డు అంజి బాబు హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా రాజోలు మండలం, పొదులాడ జంక్షన్ వద్ద అతడిని అదుపులోకి తీసుకుని, 4 బంగారు గాజులు, బంగారు గొలుసు, రెండు చెవి దిద్దులను స్వాఽధీనం చేసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో నక్కటి యువరాజు, నూకల దుర్గారావులను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీపీ సుధీర్ బాబు పర్యవేక్షణలో డీసీపీ శ్రీధర్ ఏసీపీ చక్రపాణి సూచనలతో నాచారం ఇన్‌స్పెక్టర్ ధనుంజయ హత్య కేసును చేధించారు.
సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్ టవర్ సిగ్నల్ ఆధారంగానిందితుల గుర్తింపు
ట్రావెల్ బ్యాగులో కుక్కి..గోదావరిలో పారవేసి..


