రన్‌వేపై మొరాయించిన విమానం
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో దుబాయ్ విమానం మొరాయించింది. మంగళవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లాల్సిన ఇండిగో 6ఈ–1465 విమానంలో మొత్తం 175 మంది ప్రయాణికులు ఉన్నారు. టేకాఫ్ సిద్ధమైన విమానం రన్‌వై పైకి వెళ్లగానే మొరాయించింది. దీంతో తిరిగి దానిని ట్యాక్సివే వద్దకు తీసుకొచ్చారు. సాంకేతిక సమస్యను పరిష్కరించిన తర్వాత మూడు గంటలు ఆలస్యంగా విమానం ఇక్కడి ఉంచి దుబాయ్‌కి బయలుదేరింది.
ప్రతికూల వాతావరణంతో..
హైదరాబాద్ నుంచి మంగళవారం వారణాసి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఐఎక్స్ –2746 విమానం రద్దు అయింది. అప్పటికే విమానంలోకి 148 మంది ప్రయాణికులు ఎక్కి కూర్చున్నారు. అయితే వారణాసిలో ప్రతికూల వాతావరణం ఉందని, అక్కడికి వెళ్లేందుకు అవకాశం లేదని సమాచారం అందడంతో విమానాన్ని రద్దు చేసి ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. కాగా, హైదరాబాద్–పాట్నా, హైదరాబాద్–వారణాసి మధ్యన నడిచే రెండు అరైవల్, రెండు డిపార్చర్ విమానాలను ఇండిగో ఎయిర్‌లైన్స్ రద్దు చేసింది. ఇందుకు నిర్వహణపరమైన సమస్యలతోపాటు ప్రతికూల వాతావరణం కూడా కారణమని ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి.


