దివ్యాంగుల సేవాసంస్థలోసేవలందించనున్న డా.హేమనళిని
సాక్షి సిటీబ్యూరో: నగరంలోని దివిస్ ఫౌండేషన్‌కు చెందిన దివ్యాంగుల విభాగం వర్ణం చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు కన్సల్టెంట్ డెవలప్‌మెంట్ పీడియాట్రిషియన్ గా ప్రముఖ వైద్యులు డాక్టర్ హేమ నళిని కాండ్రు నియమితులయ్యారు. ‘ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరో డెవలప్‌మెంటల్ పీడియాట్రిక్స్’ కి రాష్ట్ర సమన్వయకర్తగా పనిచేసి, పీడియాట్రిక్స్ కేర్‌లో మూడు దశాబ్దాలకు పైగా పనిచేశారు. డాక్టర్ హేమ, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఎఎస్‌డి), ఏడీహెచ్‌డీ, అభ్యాస ఇబ్బందులు, ఎదుగుదల లోపాలు వంటి నాడీ సంబంధిత సమస్యలను ఎదుర్కోవడంలో మరింత వృత్తిపరమైన నైపుణ్యాన్ని జత చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.


