నల్ల చెరువు ఆక్రమణలను త్వరలోనే తొలగిస్తాం | - | Sakshi
Sakshi News home page

నల్ల చెరువు ఆక్రమణలను త్వరలోనే తొలగిస్తాం

Feb 6 2026 11:44 AM | Updated on Feb 6 2026 11:44 AM

నల్ల చెరువు ఆక్రమణలను త్వరలోనే తొలగిస్తాం

నల్ల చెరువు ఆక్రమణలను త్వరలోనే తొలగిస్తాం

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

ఉప్పల్‌: రూ.20 కోట్లతో నల్ల చెరువును అభివృద్ధి చేస్తున్నట్లు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు. ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఈ మేరకు గురువారం ఉప్పల్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ మందుముల రజిత పరమేశ్వర్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ ఉప్పల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పరమేశ్వర్‌ రెడ్డి తో కలిసి నల్ల చెరువును సందర్శించారు. నల్ల చెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులను ఏకకాలంలో సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. చెరువు చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు కబ్జాకు గురైనట్లు గుర్తించామని. త్వరలోనే వాటిని తొలగించి నల్ల చెరువును రక్షిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు అంజయ్య, లింగంపల్లి రామకృష్ణ, తుమ్మల దేవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement