Ameerpet: యువతి స్నానం చేస్తుండగా ఫొటోలు | man caught taking photos of hostel owners daughter | Sakshi
Sakshi News home page

Ameerpet: యువతి స్నానం చేస్తుండగా ఫొటోలు

Mar 24 2026 7:08 AM | Updated on Mar 24 2026 7:08 AM

man caught taking photos of hostel owners daughter

యువకుడిపై కేసు నమోదు 

 

హైదరాబాద్‌: హాస్టల్‌లో నివాసముంటున్న ఓ యువకుడు హాస్టల్‌ యజమాని కుమార్తె స్నానం చేస్తుండగా ఫొటోలు తీయడంతో అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎస్‌ఆర్‌నగర్‌ బాపూనగర్‌లోని ప్రైవేటు హాస్టల్‌లో వరంగల్‌ జిల్లా, గీసుకొండకు చెందిన రంజిత్‌ (28) ఉంటున్నాడు. 

సేల్స్‌ మెన్‌గా పనిచేసే రంజిత్‌ హాస్టల్‌ యజమాని కుమార్తె స్నానం చేస్తుండగా కిటికీలో నుంచి రహస్యంగా ఫొటోలు తీశాడు. దీనిని గుర్తించిన సదరు యువతి కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు రంజిత్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement