‘మంగ్లీపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు’ | Singer Mangli Lawyer On 150 crore Scam! | Sakshi
Sakshi News home page

‘మంగ్లీపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు’

Mar 24 2026 7:15 AM | Updated on Mar 24 2026 7:59 AM

Singer Mangli Lawyer On 150 crore Scam!

హైదరాబాద్‌: గాయని మంగ్లీపై కొన్ని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని న్యాయవాది నాగేశ్వరరావు పూజారి తెలిపారు. సోమవారం ప్రెస్‌క్లబ్‌ హైదరాబాద్‌లోఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొన్ని చానల్స్‌లో స్కూల్స్, ఆస్పత్రులు, పబ్‌లు ఏర్పాటు చేసేందుకు పెట్టుబడులు పెట్టాలని, అత్యధిక వడ్డీ ఇస్తామని కొంతమంది వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారని అందులో సింగర్‌ మంగ్లీ, ఆమె సోదరుడు, సోదరులు ప్రధానంగా ఉన్నారని ప్రచారం చేస్తున్నారని తెలిపారు, డబ్బులు కట్టలు, కట్టలుగా చూపిస్తూ ఇది మంగ్లీ ఇంట్లోనే అని చెపుతున్నారని సుమారు రూ. 150 కోట్లు వసూలు చేశారని ప్రచారం చేస్తున్నారని ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. మంగ్లీకి పాటలు పాడడం, ఈవెంట్స్‌కు వెళ్లడం తప్ప వేరే ఎలాంటి వ్యాపారం లేదన్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. 

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement