హైదరాబాద్: మహా నగరంలో గ్యాస్ కటకట రోజురోజుకు తీవ్రమవుతోంది. ఒక వైపు వంటగ్యాస్ లేక గృహ వినియోగదారులు ఆందోళనకు గురవుతుండగా...కమర్షియల్ ఎల్‌పీజీ, సీఎన్‌జీ సైతం అందుబాటులో లేక అటు ఆటోడ్రైవర్లు, హోటల్స్, టిఫిన్ సెంటర్ల యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా దినసరి ఆదాయంపై ఆధారపడే ఆటోడ్రైవర్లు గ్యాస్ కోసం బంకుల చుట్టూ తిరుగుతూ..పూటల కొద్దీ వేచి చూస్తూ నానా యాతన పడుతున్నారు. లక్డీకాపూల్‌లోని ఓ బంక్ వద్ద సోమవారం దాదాపు వంద ఆటోలు బారులు తీరగా..చివరకు స్టాక్ లేదంటూ చెప్పడంతో డ్రైవర్లంతా ఆందోళనకు దిగారు. బంకులో గ్యాస్ ఉన్నా ఇవ్వడం లేదని నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు.


