మీరు కాంప్రమైజ్‌ అయితే.. పార్టీ కాంప్రమైజ్‌ కాదు | BJP state party in-charge Abhay Patil fires on BJP leaders in recent meeting | Sakshi
Sakshi News home page

మీరు కాంప్రమైజ్‌ అయితే.. పార్టీ కాంప్రమైజ్‌ కాదు

Mar 24 2026 3:36 AM | Updated on Mar 24 2026 3:36 AM

BJP state party in-charge Abhay Patil fires on BJP leaders in recent meeting

ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ఎంతటి వారినైనా పక్కన పెడతాం

ఇటీవల జరిగిన భేటీలో బీజేపీ నేతలకు రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్‌ అభయ్‌పాటిల్‌ వార్నింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘కాంగ్రెస్‌ సర్కార్‌పై గట్టిగా పోరాడండి.. ప్రజాసమస్యలు, ప్రభుత్వ హామీలు, గ్యారంటీలపై అధికార పార్టీని, నేతలను నిలదీయండి’అని బీజేపీ ముఖ్య నేతలు, నాయకులకు జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. తెలంగాణ బీజేపీలో కొందరు ముఖ్యనేతలు అధికార కాంగ్రెస్‌ పార్టీతో ‘కాంప్రమైజ్‌ పాలిటిక్స్‌’నెరుపుతున్నారనే ఆరో పణల మధ్య.. రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్‌ అభయ్‌ పాటిల్‌ ద్వారా నాయకులకు గట్టి వార్నింగ్‌ పంపించినట్టుగా పార్టీవర్గాల సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో కేడర్‌ కష్టపడు తుంటే.. కొందరు ముఖ్యనేతలు, నాయకులు మాత్రం ఇతర పార్టీలతో కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడటం వల్ల పార్టీ గ్రాఫ్‌ పడిపోతోందని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా అధికారంలోకి రావాలన్న లక్ష్యసాధనకు పార్టీలో అన్ని స్థాయిల నాయకులపై అధిష్టానం కన్ను ఉందని, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిపై సీరియస్‌ యాక్షన్‌ ఉంటుందని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ఎంతటి వారినైనా పక్కన పెట్టేందుకు వెనుకాడబోమని హైకమాండ్‌ సంకేతాలిచ్చినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై, సీఎం రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై కొందరు నేతలు మెతక ధోరణిని అవలంబిస్తూ అంత తీవ్రస్థాయిలో స్పందించడం లేదన్న విమర్శల మధ్య తాజాగా అభయ్‌పాటిల్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఇటీ వల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల సమయంలో పలు నియో జకవర్గాల్లో బీజేపీ ప్రజాప్రతినిధులు ఇతర పార్టీలతో చేతు లు కలిపారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరిణామా లపై సీరియస్‌గా ఉన్న బీజేపీ హైకమాండ్‌ పార్టీ లైన్‌ దాటి ఎవరైనా ప్రైవేట్‌ డీల్స్‌ కుదుర్చుకుంటే సహించేది లేదని పాటిల్‌ హెచ్చరికలు జారీ చేసినట్టు  ప్రచారం జరుగుతోంది. శనివారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని 9 జిల్లాల (పార్టీ యూని ట్లు) జిల్లా అధ్యక్షులు, డివిజన్‌ అధ్యక్షులు, ముఖ్య నాయకు ల సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతల సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ‘మీరు కాంప్రమైజ్‌ అయితే.. పార్టీ కాంప్రమైజ్‌ కాదు’అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కమలదళంలో కలకలం రేపుతున్నాయి.

తమతమ నియోజకవర్గాల్లో పట్టు కోసం లేదా కాంట్రాక్టులు, ఇతర వ్యక్తిగత ప్రయోజ నాల కోసం కొందరు నేతలు.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు పరోక్షంగా సహకరిస్తున్నారని అభయ్‌పాటిల్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించాక...త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో సత్తాచాటడం అనేది కొందరు నేతల తీరు వల్ల బీజేపీకి అగ్నిపరీక్షగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో ఏర్పడిన లోపాలు, కొందరు నేతల కుమ్మక్కు రాజకీయాలు, ఇతర సమస్యలను సరిదిద్దడమే లక్ష్యంగా అభయ్‌పాటిల్‌ రంగంలోకి దిగినట్టుగా పార్టీవర్గాలు చెబుతున్నారు. హైకమాండ్‌ వార్నింగ్‌తోనైనా కొందరు నేతల్లో మార్పు వస్తుందో లేదో చూడాల్సి ఉందని పార్టీ అంతర్గత చర్చల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement