ఔటర్‌పై రోడ్డు ప్రమాదం.. మాగంటి కుమార్తెలకు గాయాలు | Maganti Gopinath Daughters Accident | Sakshi
Sakshi News home page

ఔటర్‌పై రోడ్డు ప్రమాదం.. మాగంటి కుమార్తెలకు గాయాలు

Mar 24 2026 6:56 AM | Updated on Mar 24 2026 6:56 AM

Maganti Gopinath Daughters Accident

హైదరాబాద్‌: ఔటర్‌రింగ్‌ రోడ్డుపై ఆదివారం రాత్రి జరిగిన డీసీఎంను వెనకనుంచి ఢీ కొట్టిన కారు ప్రమాదంలో జూబ్లిహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ కుమార్తెలు అక్షర, దిశిరలకు గాయాలయ్యాయి. నార్సింగి ఇన్‌స్పెక్టర్‌ హరికృష్ణారెడ్డి తెలిపిన మేరకు.. తమ మిత్రుడిని ఎయిర్‌పోర్ట్‌లో వదిలి రాత్రి 9.30 గంటల సమయంలో శంషాబాద్‌ నుంచి గచి్చ»ౌలి వైపు వస్తున్న ఫార్చునర్‌ కారు పోలీస్‌ అకాడమి వద్దకు రాగానే ముందు వెళుతున్న డీసీఎం ఒక్కసారిగా వేగం తగ్గింది. 

దాంతో వేగంగా వస్తున్న పార్చునర్‌ కారు దాన్ని వెనకనుంచి ఢీ కొట్టింది.  మిత్రుడు అరికెపూడి దుర్గ సాయి కారును నడుపుతుండగా,  మాగంటి అక్షర నాగ ముందు కూర్చోగా వెనక సీట్లో మాగంటి దిశిర, మేడిపల్లి అభిరాంరెడ్డిలు కూర్చున్నారు. వీరంతా స్నేహితులే. ముందు కూర్చున్న అక్షరకు తీవ్ర గాయాలు కావటంతో ఆదివారం రాత్రి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్షరకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారని, మిగతా ఇద్దరు మిత్రులు రాత్రే ఇంటికి వెళ్లిపోగా సోమవారం దిశిరను  డిశ్చార్జి చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement