నేషనల్‌ డ్రోన్‌ ఇన్నొవేషన్‌ ఛాలెంజ్‌లో సార్క్స్‌ హవా | - | Sakshi
Sakshi News home page

నేషనల్‌ డ్రోన్‌ ఇన్నొవేషన్‌ ఛాలెంజ్‌లో సార్క్స్‌ హవా

Feb 6 2026 11:44 AM | Updated on Feb 6 2026 11:44 AM

నేషనల

నేషనల్‌ డ్రోన్‌ ఇన్నొవేషన్‌ ఛాలెంజ్‌లో సార్క్స్‌ హవా

కారు బోల్తా..నలుగురికి గాయాలు

సాక్షి, సిటీబ్యూరో: జాతీయ స్థాయిలో గ్రేటర్‌ నోయిడాలో నిర్వహించిన నిడార్‌ 2026 నేషనల్‌ డ్రోన్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌లో నగరానికి చెందిన సార్క్స్‌ (సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఎక్స్పీడీషన్‌) బృందం టాప్‌–5లో నిలిచి సత్తా చాటింది. నగరంలోని గోకరాజు రంగరాజు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కి చెందిన ఈ బృందం ఆధ్వర్యంలో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కోసం రూపొందించిన వారి డ్రోన్‌ పరిష్కారం, విపత్తుల సమయంలో ప్రాణాలను రక్షించే సాంకేతికత ఎలా ఉండాలనే ప్రయత్నానికి దేశ వ్యాప్తంగా ఆదరణ లభించింది.

ముగిసిన జాతీయ బాక్సింగ్‌ పోటీలు

బొల్లారం : బొల్లారంలోని ఎల్‌ఆర్‌ఎంజీ గ్రౌండ్‌లో నిర్వహించిన ఓపెన్‌ నేషనల్‌ బాక్సింగ్‌ అండ్‌ సిలంబం (కర్రసాము) పోటీలు గురువారం ముగిశాయి. పోటీల్లో హరియాణ, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ జట్లు పాల్గొన్నాయి. మొత్తం 200కిపైగా బాలబాలికలు బాక్సింగ్‌ పోటీల్లో, 50 మంది సిలంబం పోటీల్లో పాల్గొన్నారు. తమిళనాడు జట్టు విజయం సాధించగా..తెలంగాణ ద్వితీయస్థానం, ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానం దక్కించుకున్నాయి. బ్లూ వరల్డ్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ నరసింహన్‌ కన్నన్‌ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. బ్లూ వరల్డ్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ నవీన్‌ రాజ్‌, ఉపాధ్యక్షుడు జి. అరవింద్‌ పాల్గొన్నారు.

సంతోష్‌నగర్‌: కంచన్‌బాగ్‌ డీఆర్‌డీఎల్‌ ప్రధాన రహదారిపై గురువారం కారు టైర్‌ ఊడిపోవడంతో అదుపుతప్పి డివైడర్‌ మీదుగా పల్టీ కొట్టి రోడ్డుపై పడి అటుగా వచ్చిన మరో కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన రోడ్డుపై చోటు చేసుకోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

స్నాక్స్‌ సెంటర్‌లోకి దూసుకెళ్లిన రెడిమిక్స్‌ వాహనం

మియాపూర్‌: మియాపూర్‌ జేపీఎన్‌నగర్‌ కాలనీలో స్నాక్స్‌ సెంటర్‌లోకి రెడిమిక్స్‌ మిషన్‌ వాహనం దూసుకెళ్లింది.స్థానికులు తెలిపిన మేరకు.. గురువారం జేసీబీ వాహనానికి మిని రెడిమిక్స్‌ మిషన్‌ వాహనాన్ని వెనక భాగంలో తగిలించుకొని వెళుతున్నారు. ఈ క్రమంలో హుక్‌ ఊడిపోవడంతో రెడిమిక్స్‌ మిషన్‌ స్నాక్స్‌ సెంటర్‌లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో లోపల ముగ్గురు ఉన్నారు. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ప్రమాదం జరగలేదు.

నేషనల్‌ డ్రోన్‌ ఇన్నొవేషన్‌ ఛాలెంజ్‌లో సార్క్స్‌ హవా 1
1/1

నేషనల్‌ డ్రోన్‌ ఇన్నొవేషన్‌ ఛాలెంజ్‌లో సార్క్స్‌ హవా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement