కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి
మహేశ్వరం: కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ జేడ్పీ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి, పీసీసీ సభ్యుడు దేప భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని గంగారం, మహేశ్వరం, గొల్లూరు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాలు, గిరిజన తండాలు అభివృద్ధి చెందుతాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, మహాలక్ష్మీ పథకం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత గ్యాస్ సిలీండర్ సబ్సిడీ, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్‌తో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారన్నారు. మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని మెజార్టీ గ్రామ పంచాయతీలు కై వసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అంతకు ముందు మహేశ్వరం మండల కేంద్రంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి కాకి ఈశ్వర్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించి సభలో మాట్లాడారు. మహిళలు, యువకులు, వృద్ధులతో మాట్లాడి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.


