‘సాక్షి’ స్పెల్‌ బీకి విశేష స్పందన | - | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ స్పెల్‌ బీకి విశేష స్పందన

Dec 15 2025 10:31 AM | Updated on Dec 15 2025 10:31 AM

‘సాక్

‘సాక్షి’ స్పెల్‌ బీకి విశేష స్పందన

సెమీఫైనల్స్‌కు వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు

గచ్చిబౌలి: ‘సాక్షి’ స్పెల్‌ బీ సెమీఫైనల్స్‌–2025కు విశేష స్పందన లభించింది. ఆదివారం గోపన్‌పల్లిలోని విస్టా ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో నిర్వహించిన స్పెల్‌ బీ సెమీఫైనల్స్‌కు వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు హజయ్యారు. బుడి బుడి నడకలతో వచ్చి రెండో సంవత్సరం విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనడం గమనార్హం. హైదరాబాద్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన దాదాపు 700 మంది విద్యార్థులు స్పెల్‌ బీ పోటీకి హాజరయ్యారు. ‘సాక్షి’ లైవ్‌కాస్ట్‌ ద్వారా అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు రాశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వివిధ కేటగిరీలలో పరీక్ష నిర్వహించారు. తెలంగాణలో జరిగిన సెమీఫైనల్స్‌ అనంతరం ప్రతి కేటగిరీ నుంచి 20 మంది చొప్పున మొత్తం 80 మంది విద్యార్థులను ఫైనల్స్‌కు ఎంపిక చేస్తారు. విస్టా ఇంటర్నేషనల్‌ స్కూల్‌ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించారు. డ్యూక్స్‌ వాఫీ, ట్రిప్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ స్పాన్సర్‌గా వ్యవహరించారు.

చిన్నారుల్లో జోష్‌ 700 మంది విద్యార్థులు హాజరు

స్పెల్‌ బీతో నాయకత్వ లక్షణాలు

స్పెల్‌ బీ ఆంగ్ల భాషా నైపుణ్యం పెంచుకునేందుకు ఎంతగానో దోహదం చేస్తుంది. అనర్గలంగా మాట్లాడేందుకు ఆ స్కిల్స్‌ ఉపయోగపడతాయి. నేను బాగా మాట్లాడగలనే ఆత్మవిశ్వాసం అబ్బుతుంది. దీంతో బహిరంగ సభలు, సమావేశాలు, స్కూల్‌ ప్రోగ్రామ్స్‌లో బాగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్పెల్‌ బీ ద్వారా నాయకత్వ లక్షణాలు అబ్బుతాయి.

– శాంతి ప్రియ, ప్రిన్సిపాల్‌, విస్టా ఇంటర్నేషనల్‌ స్కూల్‌

హ్యాపీగా ఉంది..

నా కూతురు భారతీయ విద్యా భవన్‌లో సెకండ్‌ క్లాస్‌ చదువుతోంది. ‘సాక్షి’ ఇచ్చిన బుక్‌తో స్పెల్‌బీకి ప్రిపేర్‌ అయ్యింది. సెమీ ఫైనల్స్‌కు చేరుకోవడం చాలా హ్యపీగా ఉంది. సాక్షి అందించే మ్యాథ్స్‌ బీ, స్పెల్‌ బీ బుక్స్‌ ఎక్సలెంట్‌గా ఉంటున్నాయి. విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించే విధంగా బుక్స్‌ను తయారు చేశారు. – అనూప్‌ మాధవ్‌, పేరెంట్‌

ఇలాంటి పరీక్షలను ప్రోత్సహించాలి

ఇంగ్లిష్‌ అనేది ఒక ఆర్డర్‌లో ఉండదు. ఒక్కో సందర్భంలో ఒక విధంగా పదాలను వాడతారు. అనేక రకాలుగా ప్రాక్టీస్‌ చేసి నేర్చుకోవాల్సి ఉంటుంది. నా కుమారుడు ‘సాక్షి’ అందచేసిన బుక్‌తో ప్రాక్టీస్‌ చేసి విస్టా ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో స్పెల్‌ బీలో టాపర్‌గా నిలిచాడు. సాక్షి స్పెల్‌ బీలో సెమీఫైనల్స్‌కు చేరుకున్నాడు. ఫైనల్స్‌కు చేరుకుంటాడని ఆశిస్తున్నాం. పోటీ తత్వాన్ని పెంచే ఈలాంటి పరీక్షల్లో పాల్గొనే విధంగా విద్యార్థులను ప్రోత్సహించాలి. – మేఘా శుక్లా, పేరెంట్‌

క్రమం తప్పకుండా పాల్గొంటున్నాం

ప్రతి యేటా ‘సాక్షి’ నిర్వహించే స్పెల్‌ బీ పోటీల్లో మా విద్యార్థులు క్రమం తప్పకుండా పాల్గొంటున్నారు. ఈ సంవత్సరం ఏకంగా వివిధ కేటగిరీల్లో 18 మంది విద్యార్థులు సెమీఫైనల్స్‌కు చేరుకున్నారు. స్పెల్‌ బీ–2024లో ద్వితీయ, తృతీయ స్థానాల్లో మా విద్యార్థులు నిలిచారు. ఈసారి కూడా ఫైనల్స్‌లో విజేతలుగా నిలుస్తారనే నమ్మకం ఉంది.

– మందన, వైస్‌ ప్రిన్సిపాల్‌, మౌంట్‌ బేసిల్‌ హైస్కూల్‌, మహబూబ్‌నగర్‌

‘సాక్షి’ స్పెల్‌ బీకి విశేష స్పందన 1
1/2

‘సాక్షి’ స్పెల్‌ బీకి విశేష స్పందన

‘సాక్షి’ స్పెల్‌ బీకి విశేష స్పందన 2
2/2

‘సాక్షి’ స్పెల్‌ బీకి విశేష స్పందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement