460 మంది ‘నిషా’చరులకు చెక్!
సాక్షి, సిటీబ్యూరో: మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై నగర ట్రాఫిక్ విభాగం అధికారులు వీకెండ్స్‌తో ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగిస్తున్నారు. గడిచిన మూడు దఫాల్లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో 535, 552, 474 చొప్పున కేసులు నమోదు కాగా..గత వారాంతమైన శుక్ర, శనివారాల్లో నగర వ్యాప్తంగా చేపట్టగా..460 మంది డ్రంక్ డ్రైవింగ్ చేస్తూ అధికారులకు పట్టుబడ్డారని ట్రాఫిక్ చీఫ్ డి.జోయల్ డెవిస్ ఆదివారం వెల్లడించారు. సమయం, ప్రాంతం, సందర్భాలతో సంబంధం లేకుండా ఆకస్మికంగా డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు చేశారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సైతం అనేక ప్రాంతాల్లో చేపట్టారు. వీటిలో పట్టుబడిన 460 మందిలో 350 మంది ద్విచక్ర, 25 మంది త్రిచక్ర, 85 మంది తేలికపాటి వాహనాల చోదకుల అని ట్రాఫిక్ చీఫ్ డి.జోయల్ డెవిస్ పేర్కొన్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం 100 మిల్లీ లీటర్ల రక్తంలో 30 మిల్లీ గ్రాముల ఆల్కహాల్ ఉండే అది ఉల్లంఘన. దీన్ని సాంకేతికంగా బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ (బీఏసీ)అంటారు. నగర వ్యాప్తంగా ఈ స్పెషల్ డ్రైవ్‌లు కొనసాగిస్తామన్నారు. వీటిలో చిక్కిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు.
● డ్రంక్ డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్
● వెల్లడించిన సిటీ ట్రాఫిక్ చీఫ్


