రెండు కొత్త పైపులైన్లు
● మంజీరా పథకానికి గ్రీన్‌సిగ్నల్
● వారం రోజుల్లో గండిపేటకు ఆమోదం
● తాగునీటి వృథా కట్టడికి చర్యలు
సాక్షి, సిటీబ్యూరో
మహానగర దాహార్తిని తీర్చే మంజీరా, గండిపేట నీటి సరఫరా పథకాల పురాతన ప్రధాన పైపులైన్లకు ప్రత్యామ్నాయంగా మరో రెండింటిని ఏర్పాటు చేసేందుకు జలమండలి సిద్ధమైంది. దశాబ్దాల కాలం నాటి ప్రధాన పైపులైన్లు శిథిలావస్థకు చేరి తరచూ పగిలిపోవడం, 30 శాతం నీరు లీకేజీలతో వృథా అవుతోంది. సమస్య శాశ్వత పరిష్కారానికి పైపులైన్లను ఆధునికీకరించడంతో పాటు పాతలైన్ల వెంట సమాంతరంగా కొత్తవాటిని నిర్మించేందుకు సమగ్ర ప్రాజెక్టు (డీపీఆర్) నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. సీఎం నుంచి మంజీరా పైపులైన్ పథకానికి గ్రీన్‌సిగ్నల్ లభించగా, మరో వారం రోజుల్లో గండిపేట (ఉస్మాన్ సాగర్) పథకం రెండో పైపులైన్‌కు ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి.
తరచూ అంతరాయం..
మంజీరా నీటి సరఫరా ప్రధాన పైపులైన్ దెబ్బతింది. నెలలో కనీసం రెండు మూడుసార్లు షట్‌డౌన్ (నీటి సరఫరా నిలిపివేత) తప్పడం లేదు. మరమ్మతుల కారణంగా సనత్ నగర్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, కార్వాన్, నాంపల్లి, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, పటాన్‌చెరుు, ఆర్సీపురం, రాజేంద్రనగర్, మహేశ్వరం, కుత్బుల్లాపుర్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాపై కనీసం 24 నుంచి 72 గంటల వరకు ప్రభావం పడుతోంది. శాశ్వత పరిష్కారం కోసం ప్రధాన పైపులైన్ మరమ్మతులు, సమాంతరంగా రెండో పైపులైన్ వేసేందుకు జలమండలి సిద్ధమైంది. త్వరలో టెండర్లు పిలవనుంది.
కాండూట్ మార్గంలో గ్రావిటీ ద్వారా..
వందేళ్ల క్రితం గండిపేట (ఉస్మాన్‌సాగర్) జలాశయం నుంచి ఆసిఫ్‌నగర్ వరకు నేచురల్ స్లోప్‌తో రాతి కాలువ (కాండూట్) మార్గం ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. కాగా.. పైపులైన్ లీకేజీలతో వృథాగా నేల పాలవుతోంది. 45 ప్రాంతాల్లో లీకేజీలతో 8 నుంచి 10 ఎంజీడీలు మాత్రమే వినియోగదారులకు సరఫరా చేరుతున్నాయి. శాశ్వత పరిష్కారం కోసం గండిపేట జలాశయం నుంచి ఆసిఫ్‌నగర్ రిజర్వాయర్ వరకు మరో పైపులైన్ ఏర్పాటుకు జలమండలి సిద్ధమైంది. ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పించింది. రెండు మూడు రోజుల్లో గ్రీన్ సిగ్నల్ లభించనుందని సమాచారం.
గండిపేట తాగునీటి పథకం
మంజీరా..


