తవ్వేస్తే.. తొవ్వేదీ !
ఇళ్ల ముందే గుంతలు..
ఎన్నడు తీరేనో చింతలు
అంబర్‌పేట్ డివిజన్ నింబోలిఅడ్డాలోని రహదారి ఇది. కొన్ని నెలల క్రితమే ఇలా తవ్విపోశారు. ఇప్పటికీ మళ్లీ కొత్తగా రోడ్డు వేయలేదు. దీంతో ఈ దారిలో ఓ టిఫిన్ సెంటర్‌తో పాటు ఇతర దుకాణాలు మూతపడ్డాయి. వ్యాపారాలు దెబ్బతిన్నాయని, ఉపాధి కోల్పోయామని పలువురు లబోదిబోమంటున్నారు.
యూసుఫ్ గూడ గణపతి కాంప్లెక్స్ నుంచి మధురానగర్ వెళ్లే రోడ్డును మూడు నెలల క్రితం తవ్వి మరమ్మతుల మాటే మరిచారు. డ్రైనేజీ నీరు బయటకు వచ్చి ఈ రోడ్డంతా గుంతలతో అధ్వానంగా మారింది.
దుండిగల్ సర్కిల్ బౌరంపేట్ డివిజన్‌లోని సుకృతి హోమ్స్ పరిధిలోని రహదారిని ఏడాది కిత్రం అండర్ గ్రౌండ్ నిర్మాణం కోసం తవ్వేసి వదిలేశారు. అధికారులు పత్తా లేకుండా పోయారు. ఇళ్ల ముందే గుంతలు ఉండటంతో చిన్నారులు, మహిళలు కిందపడి గాయాల పాలవుతున్నారు. వెంటనే వీటిని పూడ్చి తమ వెతలు తీర్చాలని స్థానికులు వేడుకుంటున్నారు.
దుకాణాల ఎదుట దిబ్బ..
ఉపాధిపై దెబ్బ
తవ్వేస్తే.. తొవ్వేదీ !
తవ్వేస్తే.. తొవ్వేదీ !


