హీటెక్కిన మీటర్..
గ్రేటర్‌లో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్
వేసవి కార్యాచరణలో టీజీఎస్పీడీసీఎల్
సాక్షి, సిటీబ్యూరో
గ్రేటర్ జిల్లాల్లో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. సాధారణంగా మార్చి మొదటి వారంలో నమోదు కావాల్సిన విద్యుత్ డిమాండ్ జనవరి మూడో వారంలోనే వెలుగు చూస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే.. ఏప్రిల్ చివరి నాటికి గ్రేటర్ ఫీక్ విద్యుత్ డిమాండ్ 5 వేల మెగా వాట్లకు చేరుకోనున్నట్లు డిస్కం అంచనా వేసింది. వేసవి కార్యాచరణలో భాగంగా ఇప్పటికే ఓవర్ లోడుతో ఉన్న సబ్‌స్టేషన్లు/ ఫీడర్లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తించి, ఆ మే రకు వాటి సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించింది.
ప్రతి నెలా 35 వేల కొత్త కనెక్షన్లు..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 67.95 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 55.98 లక్షల గృహ, 9.15 లక్షల వాణిజ్య, 38 వేల పారిశ్రామిక, 1.53 లక్షల వ్యవసాయ, మరో 90 వేలకుపైగా ఇతర కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. ప్రతి నెలా కొత్తగా మరో 35 వేల కనెక్షన్లు ఉంటున్నాయి. ఈసారి వేసవి ఎండలు భగ్గున మండే అవకాశం ఉండటంతో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు డిస్కం అంచనా వేసింది. సబ్‌స్టేషన్లలోని పీటీఆర్లు, ఫీడర్లు, డీటీఆర్‌ల సామర్థ్యం పెంచే పనిలో నిమగ్నమైంది. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం రాకుండా చూస్తున్నామని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ స్పష్టంచేశారు.
సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో చేపట్టే అదనపు పనులు జోన్‌ల వారీగా..
అంశం మెట్రో మేడ్చల్ రంగారెడ్డి
కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు 716 1483 1158
పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంపు 36 58 69
కొత్తగా ఏర్పాటు చేయనున్న 11 కేవీ ఫీడర్లు 122 187 218
కొత్తగా ఏర్పాటు చేయనున్న 33 కేవీ ఫీడర్లు 37 28 53
తేదీ మెగావాట్లు
18 2675
19 3196
20 3345
21 3385
22 3375


