24 డివిజన్లు, 73 ఠాణాలు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. ప్రాథమిక జాబితాలో స్వల్ప మార్పుచేర్పులతో ఖరారైన తుది జాబితాను ఉన్నతాధికారులు గురువారం విడుదల చేశారు. సిటీలో ఏడు జోన్లు, 24 డివిజన్లు, 73 పోలీసుస్టేషన్లు ఉండనున్నాయి. ఒకప్పుడు నార్త్‌జోన్, ప్రస్తుతం సికింద్రాబాద్ జోన్‌లో మార్కెట్ ఠాణాను కొనసాగించనున్నారు. తాజా మార్పుచేర్పులతో 15 పోలీసుస్టేషన్లతో చార్మినార్ జోన్ పెద్దదిగా... 5 ఠాణాలతో శంషాబాద్ చిన్నదిగా మారింది.
జోన్లు, డివిజన్లు, ఠాణాలు ఇలా...
● చార్మినార్ జోన్‌లో.. చార్మినార్, మలక్‌పేట, మీర్‌చౌక్, సైదాబాద్, సంతోష్‌నగర్ (ఐదు) డివిజన్లు... వీటి పరిధిలో చార్మినార్, హుస్సేనిఆలం, మొఘల్‌పుర, శాలిబండ, మలక్‌పేట, చాదర్‌ఘాట్, డబీర్‌పుర, మీర్‌చౌక్, భవానీనగర్, రెయిన్‌బజార్, మాదన్నపేట, సైదాబాద్, సంతోష్‌నగర్, ఐఎస్ సదన్, ఛత్రినాక (15) ఠాణాలు.
● గోల్కొండ జోన్‌లో.. ఆసిఫ్‌నగర్, గోషామహల్, కుల్సుంపుర, టోలిచౌకి (నాలుగు) డివిజన్లు... వీటిలో ఆసిఫ్‌నగర్, మెహదీపట్నం, హబీబ్‌నగర్, మాసబ్‌ట్యాంక్, బేగంబజార్, ఆఫ్జల్‌గంజ్, గోషామహల్, మంగళ్‌హాట్, గుడిమల్కాపూర్, కుల్సుంపుర, టప్పాచబుత్ర, గోల్కొండ, టోలిచౌకి, లంగర్‌హౌస్ (14) పోలీసుస్టేషన్లు.
● జూబ్లీహిల్స్ జోన్‌లో.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎస్సార్‌నగర్ (మూడు) డివిజన్లు... వీటి పరిధిలో మధురనగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, ఎస్సార్‌నగర్, బోరబండ, సనత్‌నగర్ (ఆరు) ఠాణాలు.
● ఖైరతాబాద్ జోన్‌లో.. అబిడ్స్, పంజగుట్ట, సైఫాబాద్, సుల్తాన్‌బజార్ (నాలుగు) డివిజన్లు... వీటిలో నాంపల్లి, అబిడ్స్, ఖైరతాబాద్, పంజగుట్ట, లేక్, సైఫాబాద్, నారాయణగూడ, సుల్తాన్‌బజార్ (ఎనిమిది) ఠాణాలు.
● రాజేంద్రనగర్‌లో.. చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్ (మూడు) డివిజన్లు... వీటి పరిధిలో చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమ, బండ్లగూడ, కంచన్‌బాగ్, కామాటిపుర, బహదూర్‌పుర, కాలాపత్తర్, మైలార్‌దేవ్‌పల్లి, అత్తాపూర్, రాజేంద్రనగర్ (పది) ఠాణాలు.
● సికింద్రాబాద్‌లో.. చిక్కడపల్లి, చిలకలగూడ, గాంధీనగర్, మహంకాళి, ఉస్మానియా యూనివర్శిటీ (ఐదు) డివిజన్లు... చిక్కడపల్లి, ముషీరాబాద్, కాచిగూడ, లాలాగూడ, చిలకలగూడ, వారాసిగూడ, దోమలగూడ, గాంధీనగర్, రామ్‌గోపాల్‌పేట్, మహంకాళి, మార్కెట్, అంబర్‌పేట, ఓయూ, నల్లకుంట (14) ఠాణాలు.
● శంషాబాద్‌లో.. ఆదిభట్ల, ఆర్‌జీఐఏ (రెండు) డివిజన్లు... ఆదిభట్ల, బాలాపూర్, బడంగ్‌పేట్, పహాడీషరీఫ్, ఆర్‌జీఐఏ (ఐదు) పోలీసుస్టేషన్లు.
నగర కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణ పూర్తి
పెద్ద జోన్‌గా చార్మినార్, చిన్నదిగా శంషాబాద్


