ముగిసిన అహ్మద్ పాషా ఖాద్రీ అంత్యక్రియలు
చార్మినార్: అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ అంత్యక్రియలు బుధవారం పాతబస్తీ నూర్‌ఖాన్‌బజార్‌లో ముగిసాయి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మంత్రి అజారుద్దీన్, మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, మీర్ జుల్ఫీకర్ అలీ, మేరాజ్ హుస్సేన్, కౌసర్ మోహియుద్దీన్, మోబిన్, ఎమ్మెల్సీలు మీర్ రియాజుల్ హసన్ హాఫంది, మీర్జా రెహ్మత్ బేగ్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్ తదితరులు కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. పాషా ఖాద్రీ అంత్యక్రియలకు వేలాదిమంది హాజరయ్యారు.


