అపాయింట్‌మెంట్‌ లేకుండానే అందుబాటులో ఉంటా | - | Sakshi
Sakshi News home page

అపాయింట్‌మెంట్‌ లేకుండానే అందుబాటులో ఉంటా

Feb 6 2026 11:43 AM | Updated on Feb 6 2026 11:43 AM

అపాయింట్‌మెంట్‌ లేకుండానే అందుబాటులో ఉంటా

అపాయింట్‌మెంట్‌ లేకుండానే అందుబాటులో ఉంటా

మధ్యాహ్నం 2 తర్వాత నన్ను కలవవచ్చు: సీపీ సజ్జనర్‌

సాక్షి, సిటీబ్యూరో: ఎలాంటి సమస్య, సందేహం, ఫిర్యాదు ఉన్నా ఎలాంటి అపాయింట్‌మెంట్‌ లేకుండా నేరుగా తనను కలవవచ్చని నగర పోలీసు కమిషనర్‌ విశ్వనాథ్‌ చన్నప్ప సజ్జనర్‌ గురువారం ప్రకటించారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటల తర్వాత బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ భవనంలో తాను అందుబాటులో ఉంటానన్నారు. శుక్రవారం పాతబస్తీ చెత్తబజార్‌లోని కొత్వాల్‌ హౌస్‌కు రావాల్సి ఉంటుందని ఆయన వివరించారు.

సీపీ సార్‌.. నేనూ పోలీసింగ్‌ చేస్తా..

బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో గురువారం సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన షీల్డ్‌–2026 కార్యక్రమానికి నగర సీపీ సజ్జనర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ కొలువుదీరిన రోబోతో ఆయన సరదాగా ఇలా కరచాలనం చేశారు. తానూ పోలీసింగ్‌ చేస్తానని ఆ రోబో అన్నట్లు ఉంది కదూ ఈ చిత్రాన్ని చూస్తే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement