డ్రగ్స్ స్వాధీనం.. ముగ్గురి అరెస్టు
మూసాపేట: బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేసినట్లు కూకట్‌పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కరీంనగర్‌కు చెందిన గంపా శ్రీహర్ష (31), కూన రాజు చందు(22) బాచుపల్లి మల్లంపేటలో వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. శ్రీహర్ష వ్యాపారి. చందు డ్రైవర్. ఈ నెల 5న మల్లంపేట రోడ్డులోని హైరైజ్ ప్యారడైజ్ విల్లాస్‌లో శ్రీహర్ష ఎండీఎంఏ డ్రగ్ సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిని విచారించగా చందుతోపాటు కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన సంజప్ప అలియాస్ నితిన్(32) డ్రగ్స్ విక్రయించినట్లు చెప్పాడు. జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్న సంజప్ప బెంగుళూరు నుంచి అక్రమంగా సింథటిక్ ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకువచ్చి చందుతో కలిసి విక్రయించేవాడు. ఈ క్రమంలో ఈ నెల 7న డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు వీరిద్దరిని అరెస్టు చేశారు. 11.34 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరు పెడ్లర్లుగా మారినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరితో సంబంధమున్న మరో ఇద్దరు ఇనావో షైజా, యశ్వంత్ పరారీలో ఉన్నారు.


