గల్లీగల్లీలో గస్తీ | - | Sakshi
Sakshi News home page

గల్లీగల్లీలో గస్తీ

Feb 6 2026 11:44 AM | Updated on Feb 6 2026 11:44 AM

గల్లీగల్లీలో గస్తీ

గల్లీగల్లీలో గస్తీ

సైబరాబాద్‌లో విజిబుల్‌ పోలీసింగ్‌

సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్‌ పోలీసులు విజిబుల్‌ పోలిసింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడంతో పాటు అనుమానాస్పద కదలికలపై నిఘా ఉంచేందుకు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ లోని అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో చేతిలో లాఠీలతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా గురువారం నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌ఓ) హరికృష్ణా రెడ్డి సిబ్బందితో కలిసి 9 ప్రాంతాల్లో విజిబుల్‌ పోలీసింగ్‌ నిర్వహించారు. అలాగే జన సమర్దం అధికంగా ఉన్న ప్రాంతాలు, అలీజాపూర్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెయిన్‌ బో విస్టా జంక్షన్‌ వద్ద సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. అలాగే ఇతర పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని ప్రధాన కూడళ్ల వద్ద వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. నిరంతర పెట్రోలింగ్‌, వాహన తనిఖీలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తామని, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ రమేష్‌ రెడ్డి ప్రజలకు సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం విజిబుల్‌ పోలీసింగ్‌ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement