రాంచందర్‌రావును అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
ఆటోలో అసెంబ్లీ వద్దకు వచ్చిన రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు
బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా చేరుకున్న బీజేపీ కార్యకర్తలు.. ఎక్కడికక్కడ అరెస్ట్‌లు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘అసెంబ్లీ ముట్టడి’పార్టీ నాయకులు–పోలీసుల మధ్య తోపులాటతో ఉద్రిక్తంగా మారింది. పోలీసుల కళ్లు కప్పి ఆటోలో అసెంబ్లీ ప్రధాన గేటు వద్దకు చేరుకొని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, ఇతర నేతలు నిరసన తెలిపారు. నాంపల్లి నుంచి అసెంబ్లీ వైపు నకు కార్యకర్తలు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆరు గ్యారంటీలు అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘6 గ్యారంటీలు ఎక్కడ’అని నినాదాలు చేస్తూ అసెంబ్లీ సమీపానికి చేరుకొని బారికేడ్లు దాటేందుకు యతి్నంచిన కార్యకర్తలను పోలీసులు అడ్డు కున్నారు. వివిధ జిల్లాల నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు అసెంబ్లీ వద్దకు చేరుకొని ముట్టడించే ప్రయత్నం చేశారు. అనంతరం రాంచందర్‌రావు తదితరులను అరెస్ట్ చేసి పంజగుట్ట స్టేషన్‌కు తరలించారు. ఆయన్ను సాయంత్రం విడుదల చేశారు.
ఆ తర్వాత కూడా ఐదు, పది మంది చొప్పున కొన్ని బ్యాచ్‌ల వారీగా ఆటోలు, క్యాబ్‌లు, ఇతర రూపాల్లో శాసనసభ సమీ పానికి చేరుకున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.800 మందికి పైగా బీజేపీ కార్యకర్తలు, 50 మంది మహిళలు, యువమోర్చా కార్యకర్తలను అరెస్ట్ చేసి వివిధ ప్రాంతా ల్లోని 9 పోలీస్‌స్టేషన్లకు తీసుకెళ్లారు. పలువురు నేతలను వారి ఇళ్ల వద్ద, అసెంబ్లీకి మార్గమధ్యలో హౌస్ అరెస్ట్‌లు చేసి పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని, దాదాపు రెండున్నరేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆధ్వర్యంలో ‘చలో అసెంబ్లీ’కి రాష్ట్ర బీజేపీ పిలుపునిచ్చింది.
శాసనసభ ముట్టడికి సంబంధించి పోలీసులకు ముందస్తు సమాచారంతో చుట్టుపక్కల పెద్దసంఖ్యలో మోహరించారు. సోమ వారం ఉదయం 11 గంటల నుంచి పలు దఫాలుగా బ్యాచ్‌లుబ్యాచ్‌లుగా అసెంబ్లీ వద్దకు చేరుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో డా.ఎన్.గౌతమ్‌రావు, టి. వీరేందర్‌గౌడ్, బండ కార్తీకరెడ్డి, శిల్పారెడ్డి, ఎన్వీ సుభాశ్, దీపక్‌రెడ్డి, గణేశ్, మహేందర్ ఉన్నారు. రాంచందర్‌రావును పోలీస్‌స్టేషన్ లో ఎమ్మెల్యేలు పాయల్‌శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీలు ఏవీఎన్‌రెడ్డి, డా.సి.అంజిరెడ్డి, మల్క కొమరయ్య పరామర్శించారు.
మోసపూరిత హామీల సర్కార్‌ను మరింత నిలదీస్తాం: రాంచందర్‌రావు
ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మోసపూరిత హామీలతో ప్రజలను వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరింత నిలదీస్తామన్నారు.
ప్రజావ్యతిరేక పాలనపై రాజీలేని పోరాటం: ఏలేటి
కాంగ్రెస్ సర్కార్ ప్రజావ్యతిరేక పాలనపై బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందే తప్ప మడమ తిప్పదని బీజేఎలీ్పనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీల అమలు ఏమైందని ప్రశ్నించిన రాంచందర్‌రావు అరెస్టు.. ప్రభుత్వ నిర్బంధ పాలనకు నిదర్శనమని ఒకప్రకటనలో విమర్శించారు.


