వెల్లువెత్తిన చైతన్యం | - | Sakshi
Sakshi News home page

వెల్లువెత్తిన చైతన్యం

Dec 15 2025 1:04 PM | Updated on Dec 15 2025 1:04 PM

వెల్ల

వెల్లువెత్తిన చైతన్యం

ఉమ్మడి జిల్లాలో 69,761 వేల మంది ఓటింగ్‌కు దూరం

అవీ.. ఇవీ..

ఓటేసిన ప్రముఖులు

ఆమనగల్లు: కడ్తాల్‌లో ఓటేసేందుకు క్యూకట్టిన మహిళలు

ముగిసిన రెండో విడత పంచాయతీ పోరు

జిల్లాలోని ఏడు మండలాల్లో ఎన్నికలు

ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు

85.3 శాతం ఓటింగ్‌ నమోదు

పల్లెల్లో పండుగ వాతావరణం

గెలుపొందిన అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారుల జాబితా ఇలా..

మండలం మొత్తం జీపీలు కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌ బీజేపీ ఇతరులు

ఆమనగల్లు 13 03 03 01 06

తలకొండపల్లి 32 09 16 02 05

కడ్తాల్‌ 24 11 07 02 04

మొయినాబాద్‌ 19 07 07 04 01

చేవెళ్ల 25 16 03 03 03

శంకర్‌పల్లి 24 12 07 01 04

షాబాద్‌ 41 17 22 01 01

మొత్తం 178 75 65 14 24

రెండో విడతలోనూ హస్తానిదే హవా

రెండో విడత పంచాయతీ పోరు ప్రశాంతంగా ముగిసింది. ఉదయం మంచుతో పాటు చలిగాలులు వీస్తుండటంతో మందకొడిగా ప్రారంభమైన పోలింగ్‌ 11 తర్వాత ఊపందుకుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కాగానే ఓటర్లు ఓటు వేసేందుకు క్యూ కట్టారు. ఉపాధి, ఉద్యోగ నిమిత్తం నగరంతో పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు సైతం పెద్ద ఎత్తున స్వగ్రామాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్‌, కౌంటింగ్‌ సందర్భంగా ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరిగిన పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. – సాక్షి, రంగారెడ్డిజిల్లా

రంగారెడ్డి జిల్లాలోని 7 మండలాల పరిధిలో 178 పంచాయతీలకు, 1,540 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయగా, వీటిలో 13 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 165 స్థానాలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 2,27,883 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,94,375 మంది తమ ఓటు హక్కు (85.3 శాతం) వినియోగించుకున్నారు. 33,508 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అత్యధిక పోలింగ్‌ శాతం ఆమనగల్లు మండలంలో, అత్యల్పంగా షాబాద్‌ మండలంలో నమోదైంది.

వికారాబాద్‌ జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో 155 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్‌ జారీ చేయగా, వీటిలో 20 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 135 సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 2,09,847 మంది ఓటర్లకు గాను, 1,73,594 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 82.72 శాతం ఓటింగ్‌ నమోదైంది. 36,253 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అత్యధిక పోలింగ్‌ వికారాబాద్‌ మండలంలో(87.77 శాతం) నమోదు కాగా, అత్యల్పంగా బంట్వారంలో (80. 25 శాతం) నమోదైంది.

చేవెళ్ల మండలం ఆలూరులో 14వ వార్డు సభ్యురాలిగా పోటీ చేసిన కుమార్తె రాములమ్మకు ఓటు వేయడానికి వచ్చిన వెంకన్నగూడకు చెందిన సోలిపేట బుచ్చయ్య (68) అక్కడే కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు రఽవీకరించారు.

శంకర్‌పల్లి మండలం శేరిగూడలో దొంగ ఓటు వేయానికి వచ్చిన వ్యక్తిని పోలింగ్‌ ఏజెంట్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

మొయినాబాద్‌ మండలం కనకమామిడి, కేతిరెడ్డిపల్లిలోని పోలింగ్‌ కేంద్రాలు సహా చేవెళ్ల మండలం ముడిమ్యాల, షాబాద్‌ మండలం పోతుగల్‌ కేంద్రాలను కలెక్టర్‌ నారాయణరెడ్డి పరిశీలించారు.

పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు ఓటెత్తారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, చంటిపిల్లలతో మహిళలు పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు పోలింగ్‌ కేంద్రంలోకి చేరుకున్న ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో పలుచోట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యంగా మొదలైంది. తొలుత వార్డు సభ్యుల ఓట్లను లెక్కించిన అధికారులు.. తర్వాత సర్పంచ్‌ ఓట్లను లెక్కించారు. తొలి ఫలితం మధ్యాహ్నం మూడు గంటల తర్వాతే వెల్లడైంది. రాత్రి తొమ్మిది తర్వాత కూడా లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేశారు. పోలింగ్‌ కేంద్రాల ముందు గుంపులుగా చేరిన వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు.

రెండో విడత సర్పంచ్‌ ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థులే హవా కొనసాగించారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు వీరికి గట్టిపోటీ ఇచ్చినప్పటికీ మెజార్టీ స్థానాల్లో ఓటమి తప్పలేదు. ఇక బీజేపీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసింది. నిజానికీ పార్టీలు, బీఫాంలు, గుర్తులతో సంబంధం లేకుండా ఎన్నికలు నిర్వహించినప్పటికీ.. పరోక్షంగా ఆయా అభ్యర్థులకు అధికార, ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. జెండాలకు అతీతంగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీ మాజీ సభ్యులు, మాజీ ఎంపీపీలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్‌రెడ్డి చేవెళ్ల మండలం గొల్లపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు.

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తలకొండపల్లి మం డలం ఖానాపూర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి చేవెళ్ల మండలం కౌకుంట్లలో ఓటు వేశారు.

వెల్లువెత్తిన చైతన్యం1
1/1

వెల్లువెత్తిన చైతన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement