నిరంతర సంస్కరణలతోనే రైల్వే మనుగడ
బన్సీలాల్‌పేట్: రైల్వే అభివృద్ధి, మనుగడకు నిరంతర సంస్కరణలు, నైపుణ్యాలు కీలక భూమిక పొషిస్తాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీ వాస్తవ అన్నారు. సికింద్రాబాద్ బోయిగూడ రైల్ కళారంగ్‌లో గురువారం దక్షిణ మధ్య రైల్వే 70వ వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జీఎం సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ప్రయాణికులకు మెరుగైన సేవలతో పాటు ఉత్పత్తి వంటి కీలక రంగాల్లో నిర్ణీత కాల పరిమితితో కూడిన సంస్కరణలు అవసరమన్నారు. కాలానుగుణంగా సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగుతూ సంస్థ పురోభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. ఈ సందర్భంగా జీఎం ..రైల్వే ఉత్తమ సేవలందించిన సిబ్బంది,అధికారులకు సేవా పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో అదనపు జనరల్ మేనేజర్ సత్యప్రకాష్, సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ ఆశిష్ మెహ్రోత్రా పాల్గొన్నారు.
దక్షిణ మధ్య రైల్వే జీఎంసంజయ్‌కుమార్ శ్రీ వాస్తవ


