మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్‌లో మాజీ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) టైటిల్ పోరుకు చేరింది.
వరుసగా ఐదు విజయాలతో అందరికంటే ముందుగా ‘ప్లే ఆఫ్స్’ చేరిన ఆర్‌సీబీ జట్టు ఆపై రెండు ఓటములు ఎదుర్కొంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండోసారి డబ్ల్యూపీఎల్ టోర్నీలో ఫైనల్లోకి అడుగు పెట్టింది. గురువారం జరిగిన తమ చివరి మ్యాచ్‌లో 2024 విజేత ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌పై నెగ్గింది.


