breaking news
Nadine de Klerk
-
ఆర్సీబీకి భారీ షాక్!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మహిళా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ మరో రెండు వారాల పాటు ఆటకు దూరం కానుంది. ఈ విషయాన్ని ఆర్సీబీ వుమెన్ హెడ్‌కోచ్ మలోలన్ రంగరాజన్ ధ్రువీకరించాడు.తొలుత భుజం నొప్పి.. ఇపుడు‘‘బెంగళూరులో ఉన్న బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)నుంచి పూజా వస్త్రాకర్ (Pooja Vastrakar) విడుదల కావడానికి మరో రెండు వారాలు పట్టవచ్చు. తొలుత ఆమె భుజం నొప్పితో CoEలో చేరింది.అయితే, దురదృష్టవశాత్తూ తొడకండరాలు పట్టేయంతో మరికొన్నాళ్ల పాటు ఆమెకు విశ్రాంతి అవసరమైంది. కోలుకోవడానికి పదిహేనుల రోజుల దాకా పట్టవచ్చు. ఆమె ఎప్పుడు తిరిగి వస్తుందో వేచి చూడాల్సిందే’’ అని మలోలన్ రంగరాజన్ తెలిపాడు.‘భారీ’ ధరకు కొనుగోలుకాగా 26 ఏళ్ల పూజా వస్త్రాకర్ టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా చివరగా కాంపిటేటివ్ క్రికెట్ ఆడింది. అయితే, ఆమెకు ఉన్న అరుదైన నైపుణ్యాల కారణంగా మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)-2025 వేలంలో ఆర్సీబీ ఏకంగా రూ. 85 లక్షలు వచ్చించి పూజాను కొనుగోలు చేసింది. డబ్ల్యూపీఎల్‌తో ఆమె తిరిగి కాంపిటేటివ్ క్రికెట్లో రీఎంట్రీ ఇవ్వాల్సింది.అయితే, తొడ కండరాల గాయం కారణంగా పూజా వస్త్రాకర్ ఆటకు దూరం కాగా.. ఆర్సీబీ రెండు వారాల పాటు ఆమె సేవలు కోల్పోనుంది. ఇదిలా ఉంటే.. డబ్ల్యూపీఎల్-2026 ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ.. ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది.నదినె డి క్లెర్క్ అద్భుత ప్రదర్శనచివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో డిఫెండింగ్ చాంపియన్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించిన ఆర్సీబీ.. ఈ సీజన్లో శుభారంభం అందుకుంది. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ నదినె డి క్లెర్క్ అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించింది. చివరి బంతికి ఫోర్ బాది ఆర్సీబీని విజయతీరాలకు చేర్చింది.నవీ ముంబై వేదికగా శుక్రవారం టాస్ గెలిచిన ఆర్సీబీ.. ముంబైని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో హర్మన్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. సజీవన్ సజన 25 బంతుల్లో 45 పరుగులు చేసి ముంబై టాప్ రన్ స్కోరర్‌గా నిలిచింది.63 పరుగులతో అజేయంగాఇక లక్ష్య ఛేదనలో ఆర్సీబీ ఆదిలో తడబడింది. అయితే, ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన డి క్లెర్క్ 44 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 63 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమెకు తోడుగా ప్రేమా రావత్ నాలుగు బంతుల్లో రెండు ఫోర్లు బాది జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించింది. కాగా అంతకు ముందు డి క్లెర్క్ నాలుగు వికెట్లతో సత్తా చాటింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచింది.చదవండి: మేము నటిస్తున్నామని మాకూ తెలుసు: బీసీబీపై బంగ్లా కెప్టెన్ విమర్శలు -
ఇక్కడ కూడా వదలరా?.. స్మృతి రియాక్షన్ వైరల్
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2026ను విజయంతో ఆరంభించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ). డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన WPL ఓపెనర్‌లో ఆర్సీబీ జయకేతనం ఎగురవేసింది.సౌతాఫ్రికాకు చెందిన నదినె డి క్లెర్క్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆర్సీబీకి సంచలన విజయం అందించింది. దీంతో ఆర్సీబీ ఖాతాలో తొలి గెలుపు నమోదైంది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా స్మృతి మంధాన (13 బంతుల్లో 18) విఫలమైనా.. కెప్టెన్‌గా మాత్రం హిట్టయ్యింది.ఇక ఆటకు తోడు అందంతో మెరిసే స్మృతి మంధానకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విరాట్ కోహ్లి మాదిరే స్మృతి పట్ల కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ వీరాభిమానం చూపిస్తారు. అందుకే కెమెరామెన్ సైతం మైదానంలోపలా, వెలుపలా ఆమెపైనే ఎక్కువగా దృష్టి పెడతాడు.ఇక్కడ కూడా వదలరా?ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు మైదానంలో బ్యాట్‌తో స్మృతి ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఓ కెమెరామెన్ ఆమెకు దగ్గరగా వచ్చి ఫొటోలు తీసే ప్రయత్నం చేశాడు. దీంతో కాస్త చిరాకుపడిన స్మృతి.. ‘‘ఇక్కడ కూడా వదలరా? ఏంటి భయ్యా ఇది?’’ అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది.మాకు అలవాటేఇక తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించడం పట్ల స్మృతి హర్షం వ్యక్తం చేసింది. ఉత్కంఠ పోరులో గెలవడం తమకు అలవాటేనని.. నదినె వల్లే ఈ గెలుపు సాధ్యమైందని ప్రశంసించింది. జట్టులోని ప్రతి ఒక్కరు సానుకూల దృక్పథంతో ముందుకు సాగారని కొనియాడింది.కాగా స్మృతి వ్యక్తిగత జీవితంలో ఇటీవల ఓ చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న పలాష్ ముచ్చల్‌తో పెళ్లి పీటలు ఎక్కే కొన్ని గంటలకు ముందు.. హఠాత్తుగా వివాహం ఆగిపోయింది. పలాష్ ఆమెను మోసం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.డబ్ల్యూపీఎల్-2026: ముంబై వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు👉ముంబై: 154/6(20)👉ఆర్సీబీ: 157/7(20)👉ఫలితం: మూడు వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: నదినె డి క్లెర్క్ (4/26, 44 బంతుల్లో 63 నాటౌట్).చదవండి: మేము నటిస్తున్నామని మాకూ తెలుసు: బీసీబీపై బంగ్లా కెప్టెన్ విమర్శలుCameraman not leaving Smrithi alone to practice and see Smrithi’s reaction 😂 pic.twitter.com/QVF8q4WTzw— RCB (@RCBtweetzz) January 9, 2026


