స్మృతి మంధాన (PC: BCCI)
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2026ను విజయంతో ఆరంభించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ). డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన WPL ఓపెనర్‌లో ఆర్సీబీ జయకేతనం ఎగురవేసింది.
సౌతాఫ్రికాకు చెందిన నదినె డి క్లెర్క్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆర్సీబీకి సంచలన విజయం అందించింది. దీంతో ఆర్సీబీ ఖాతాలో తొలి గెలుపు నమోదైంది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా స్మృతి మంధాన (13 బంతుల్లో 18) విఫలమైనా.. కెప్టెన్‌గా మాత్రం హిట్టయ్యింది.
ఇక ఆటకు తోడు అందంతో మెరిసే స్మృతి మంధానకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విరాట్ కోహ్లి మాదిరే స్మృతి పట్ల కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ వీరాభిమానం చూపిస్తారు. అందుకే కెమెరామెన్ సైతం మైదానంలోపలా, వెలుపలా ఆమెపైనే ఎక్కువగా దృష్టి పెడతాడు.
ఇక్కడ కూడా వదలరా?
ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు మైదానంలో బ్యాట్‌తో స్మృతి ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఓ కెమెరామెన్ ఆమెకు దగ్గరగా వచ్చి ఫొటోలు తీసే ప్రయత్నం చేశాడు. దీంతో కాస్త చిరాకుపడిన స్మృతి.. ‘‘ఇక్కడ కూడా వదలరా? ఏంటి భయ్యా ఇది?’’ అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది.
మాకు అలవాటే
ఇక తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించడం పట్ల స్మృతి హర్షం వ్యక్తం చేసింది. ఉత్కంఠ పోరులో గెలవడం తమకు అలవాటేనని.. నదినె వల్లే ఈ గెలుపు సాధ్యమైందని ప్రశంసించింది. జట్టులోని ప్రతి ఒక్కరు సానుకూల దృక్పథంతో ముందుకు సాగారని కొనియాడింది.
కాగా స్మృతి వ్యక్తిగత జీవితంలో ఇటీవల ఓ చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న పలాష్ ముచ్చల్‌తో పెళ్లి పీటలు ఎక్కే కొన్ని గంటలకు ముందు.. హఠాత్తుగా వివాహం ఆగిపోయింది. పలాష్ ఆమెను మోసం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
డబ్ల్యూపీఎల్-2026: ముంబై వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు
👉ముంబై: 154/6(20)
👉ఆర్సీబీ: 157/7(20)
👉ఫలితం: మూడు వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపు
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: నదినె డి క్లెర్క్ (4/26, 44 బంతుల్లో 63 నాటౌట్).
చదవండి: మేము నటిస్తున్నామని మాకూ తెలుసు: బీసీబీపై బంగ్లా కెప్టెన్ విమర్శలు
Cameraman not leaving Smrithi alone to practice and see Smrithi’s reaction 😂 pic.twitter.com/QVF8q4WTzw
— RCB (@RCBtweetzz) January 9, 2026


