breaking news
Royal Challengers Bengaluru Women
-
డబ్ల్యూపీఎల్‌లో మరో రెండు జట్లు!.. బీసీసీఐ ప్లాన్ ఏంటి?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో 2023లో మొదలైన మహిళా ప్రీమియర్ లీగ్ విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. అరంగేట్ర సీజన్లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలవగా.. గతేడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ట్రోఫీని ముద్దాడింది.ఇక ఈ ఏడాది మరోసారి ముంబై చాంపియన్‌గా అవతరించగా.. 2026లోనైనా టైటిల్ గెలవాలని యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పట్టుదలగా ఉన్నాయి. ఇందుకు అనుగుణంగానే వేలానికి ముందు తమకు కావాల్సిన ప్లేయర్లను అట్టిపెట్టుకున్న ఫ్రాంఛైజీలు.. వద్దనుకున్న క్రికెటర్లను వదిలించుకున్నాయి.బీసీసీఐ సుముఖంగా ఉందిఈ నేపథ్యంలో న్యూఢిల్లీ వేదికగా గురువారం జరిగిన మెగా వేలంలో తమ వ్యూహాలకు అనుగుణంగా ఐదు ఫ్రాంఛైజీలు ప్లేయర్లను కొనుగోలు చేశాయి. ఇక వేలం సందర్భంగా ఢిల్లీ ఫ్రాంఛైజీ సహ యజమాని పార్థ్ జిందాల్ (Parth Jindal) చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. భారత మహిళా క్రికెట్ రాత మారనుందని.. డబ్ల్యూపీఎల్‌ను విస్తరించేందుకు బీసీసీఐ సుముఖంగా ఉందని ఆయన పేర్కొన్నారు.ఆదరణకు ఇదే నిదర్శనంఈ మేరకు.. ‘‘1983లో ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత పురుషుల క్రికెట్ పరిస్థితి ఎంతలా మెరుగుపడిందో మనం చూశాం. వన్డే వరల్డ్‌కప్-2025లో చాంపియన్‌గా నిలిచిన తర్వాత భారత మహిళా క్రికెట్ జట్టు రాత కూడా మారనుంది. 446 మిలియన్ల మంది భారతీయులు మనోళ్లు ఆడిన ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించారు.పురుషుల టీ20 ప్రపంచకప్ ఫైనల్ కంటే కూడా ఈ మ్యాచ్‌కే అత్యధిక వీక్షణలు వచ్చాయి. నిజానికి ఇంతకు ముందు మహిళా వేలం గురించి ఎవరూ మాట్లాడేవారే కాదు. అయితే, ‘నవంబరు 27న వేలంలో మీరు ఏం చేయబోతున్నారు?మెగ్ లానింగ్‌ను తీసుకుంటారా? మీరెందుకు ఆమెను వదిలిపెట్టారు? వంటి ప్రశ్నలు ఎదురయ్యాయి. మూడేళ్లుగా లీగ్ జరుగుతున్నా ఎవరూ మరీ ఇంతగా ఆసక్తి చూపించలేదు. వరల్డ్‌కప్ తర్వాత మన మహిళల లీగ్‌కు ఆదరణ పెరిగిందనడానికి ఇదే నిదర్శనం.ఒకటి లేదంటే రెండు జట్లు..డబ్ల్యూపీఎల్ విస్తరించబోతోంది. బీసీసీఐ ఇందుకు సంబంధించి ప్రణాళికలు రచిస్తోందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ లీగ్‌లో మరొకటి.. లేదంటే మరో రెండు ఫ్రాంఛైజీలు చేరే అవకాశం ఉంది’’ అని పార్థ్ జిందాల్ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యల్ని బట్టి వచ్చే డబ్ల్యూపీఎల్ సీజన్లో మరో రెండు కొత్త జట్లను చూసే అవకాశం లేకపోలేదంటూ మహిళా క్రికెట్‌ను ఆదరించే అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే -
WPL 2025: స్మృతి మంధాన విఫలం.. దంచికొట్టిన ఎలిస్ పెర్రీ.. కానీ!
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల(RCBW) జట్టు నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్(WPL)-2025లో ఆరంభంలో అదరగొట్టిన ఆర్సీబీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది.గత మూడు మ్యాచ్‌లలో స్మృతి మంధాన(Smriti Mandhana) సేన చేదు అనుభవాలు చవిచూసింది. ముంబై ఇండియన్స్ వుమెన్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఓడిన ఆర్సీబీ.. ఆ తర్వాత యూపీ వారియర్స్‌తో మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా తెచ్చుకుని టై చేసుకుంది. అనంతరం గుజరాత్ జెయింట్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిన బెంగళూరు జట్టు.. శనివారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టింది.సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో టాస్ ఓడిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన(8) దారుణంగా విఫలం కాగా.. మరో ఓపెనర్ డానియెల్ వ్యాట్- హాడ్జ్(18 బంతుల్లో 21) ఫర్వాలేదనిపించింది. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ ఎలిస్ పెర్రీ, రాఘ్వి బిస్త్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దింది.పెర్రీ 47 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 60 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. మరోవైపు.. రాఘ్వి 32 బంతుల్లో 33 పరుగులు చేయగలిగింది. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్(5), కనిక అహుజా(2) చేతులెత్తేయగా.. జార్జియా వారెహాం 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఫలితంగా ఆర్సీబీ 147 పరుగులు చేసింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో శిఖా పాండే, నల్లపురెడ్డి చరణి రెండేసి వికెట్లు కూల్చగా.. మరిజానే కాప్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకుంది.డబ్ల్యూపీఎల్-2025: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఆర్సీబీ వుమెన్ తుదిజట్లుఢిల్లీ క్యాపిటల్స్మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, మరిజానే కాప్, జెస్ జోనాస్సెన్, సారా బ్రైస్ (వికెట్ కీపర్), నికీ ప్రసాద్, శిఖా పాండే, మిన్ను మణి, నల్లపురెడ్డి చరణి.ఆర్సీబీ వుమెన్స్మృతి మంధాన (కెప్టెన్), డానియల్ వ్యాట్-హాడ్జ్, ఎలిస్ పెర్రీ, రాఘ్వి బిస్త్, కనికా అహుజా, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జార్జియా వారెహాం, కిమ్ గార్త్, స్నేహ్ రాణా, రేణుకా సింగ్ ఠాకూర్, ఏక్తా బిష్త్.చదవండి: Karun Nair: మళ్లీ శతక్కొట్టాడు.. సెలబ్రేషన్స్‌తో సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్! -
మహిళల ప్రీమియర్ లీగ్‌లో డ్యాన్స్ తో అదరగొట్టిన శ్రుతి హాసన్ (ఫొటోలు)
-
RCB సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి జట్టుగా అరుదైన ఘనత
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల(Royal Challengers Bengaluru Women) జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగుల లక్ష్య ఛేదనను పూర్తి చేసి.. అరుదైన ప్రపంచ రికార్డు సాధించింది. కాగా వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL)-2025 సీజన్ శుక్రవారం (ఫిబ్రవరి 14) మొదలైంది.డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ- గుజరాత్ జెయింట్స్ వుమెన్(Gujarat Giants Women) మధ్య మ్యాచ్‌తో వడోదర వేదికగా ఈ మెగా ఈవెంట్‌కు తెరలేచింది. కోటాంబి స్టేడియంలో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే నష్టపోయి 201 పరుగులు చేసింది.ఆష్లే గార్డ్నర్ సునామీ ఇన్నింగ్స్ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ బెత్ మూనీ(42 బంతుల్లో 56) అర్ధ శతకంతో రాణించగా.. కెప్టెన్ ఆష్లే గార్డ్నర్ సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగింది. కేవలం 37 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 79 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. మిగతా వాళ్లలో డియాండ్రా డాటిన్(13 బంతుల్లో 25), సిమ్రన్ షేక్(5 బంతుల్లో 11) ధనాధన్ దంచికొట్టారు. దీంతో గుజరాత్‌కు భారీ స్కోరు సాధ్యమైంది.అయితే, లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు కెప్టెన్ స్మృతి మంధాన(9), డానియెల్ వ్యాట్- హాడ్జ్(4)లను సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్‌కు చేర్చింది ఆష్లే గార్డ్నర్. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ ఎలిస్ పెర్రీ(34 బంతుల్లో 57) అర్ధ శతకంతో ఇన్నింగ్స్ చక్కదిద్దగా.. రాఘ్వి బిస్త్(25) ఆమెకు సహకారం అందించింది.రిచా విధ్వంసకర ఇన్నింగ్స్అయితే, వికెట్ కీపర్ రిచా ఘోష్ క్రీజులోకి రాగానే మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన రిచా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడింది. కేవలం 27 బంతుల్లోనే 64 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఇక రిచాకు తోడుగా కనికా అహుజా(13 బంతుల్లో 30) బ్యాట్ ఝులిపించింది. ఇద్దరూ కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు.ఈ క్రమంలో 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీ వుమెన్ వరల్డ్ రికార్డు సాధించింది. మహిళల డొమెస్టిక్, ఫ్రాంఛైజీ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగుల టార్గెట్‌ను పూర్తి చేసిన జట్టుగా నిలిచింది. ఇక అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన రిచా ఘోష్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.మహిళల డొమెస్టిక్ లేదంటే ఫ్రాంఛైజీ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగుల లక్ష్య ఛేదన1. ఆర్సీబీ వుమెన్- వడోదరలో 2025లో గుజరాత్ జెయింట్స్‌పై- 202/4(WPL)2. ముంబై ఇండియన్స్- ఢిల్లీలో 2024లో గుజరాత్ జెయింట్స్‌పై- 191/3(WPL)3. ఆర్సీబీ వుమెన్- ముంబైలో 2023లో గుజరాత్ జెయింట్స్- 189/2(WPL)4. మెల్బోర్న్ రెనెగేడ్స్- అడిలైడ్‌లో 2024లో అడిలైడ్ స్ట్రైకర్స్‌పై 186/1(WBBL)5. సదరన్ వైపర్స్- 2019లో యార్క్‌లో యార్క్‌షైర్ డైమండ్‌పై 185/4(WCSL).డబ్ల్యూపీఎల్-2025: ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ స్కోర్లు👉గుజరాత్ జెయింట్స్- 201/5 (20)👉ఆర్సీబీ వుమెన్- 202/4 (18.3)👉ఫలితం: గుజరాత్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన ఆర్సీబీ వుమెన్.చదవండి: అద్భుత ఫామ్.. అతడిని ఆపతరమా!.. ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలే!


