హష్ ఆయిల్ విక్రయిస్తుండగా ఇద్దరి అరెస్టు
శంషాబాద్ రూరల్: హష్ ఆయిల్ విక్రయించేందుకు యత్నిస్తుండగా ఇద్దరిని శంషాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్ కె.నరేందర్‌రెడ్డి కథనం ప్రకారం... ఏపీలోని విశాఖపట్నం ఓల్డ్ గాజువాకకు చెందిన డింబకేశ్వర నాగప్రణవ్(26) నగరానికి వచ్చి డ్రైవర్‌గా పనిచేస్తూ ఊట్‌పల్లిలోని బంధువుల ఇంట్లో నివాసముంటున్నాడు. ఇతను కొన్నాళ్ల కిందట జైలులో ఉన్నప్పుడు గంజాయి కేసులో శిక్ష అనుభవిస్తున్న విశాఖపట్నం చౌడవరం నివాసి యశ్వంత్‌తో పరిచయం ఏర్పడింది. ప్రణవ్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 2024లో శ్రీకాకుళం ఇచ్ఛాపురంవాసి యెర్ర శ్రీనివాసులు(21)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి పాతబస్తీలో గంజాయిని కొనుగోలు చేసి సేవించేవారు. గత డిసెంబర్ 30న యశ్వంత్ ద్వారా ప్రణవ్ గోవాకు వెళ్లి రెండు సీసాల హష్ ఆయిల్ కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో ఊట్‌పల్లిలోని తన నివాసానికి సమీపంలో కొంతమంది గంజాయి, హష్ ఆయిల్ సేవిస్తున్నట్లు గమనించాడు. ఈ క్రమంలో ఈ నెల 7న వారి వద్దకు శ్రీనివాసులతో కలిసి వెళ్లి హ్యష్ ఆయిల్‌ను విక్రయిస్తామనంటూ బేరసారాలకు దిగాడు. అప్పటికే అక్కడ నిఘా వేసిన పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనున్న హష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


