సందడే.. సందడి
● హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు విశేష స్పందన
● ఒకవైపు పుస్తకావిష్కరణలు
● మరోవైపు పుస్తక సమీక్షలు
నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న 38వ బుక్ ఫెయిర్ మంగళవారం ఐదో రోజు సందడిగా సాగింది. ఒక వైపు కొంపల్లి వెంకట్ గౌడ్ వేదికపై పుస్తకావిష్కరణలు మరోవైపు అనిశెట్టి రజిత వేదికపై చర్చ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పుస్తకాల భవిష్యత్తు గ్రంథాలయాల పాత్ర అనే అంశంపై చర్చ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్, ఉస్మానియా యూనివర్సిటీ గ్రంథాలయ శాస్త్ర విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ సుదర్శన్ రావు, ఓయూ గ్రంథాలయ అధికారి డాక్టర్ ఎస్. యాదగిరి పాల్గొన్నారు. డాక్టర్ రియాజ్ మాట్లాడుతూ... సమాజంలోని అజ్ఞానం అనే చీకట్లు తొలగించే జ్ఞాన దీపాలు గ్రంథాలయాలకు విడదీయరాని సంబంధం ఉందన్నారు. ప్రొఫెసర్ సుదర్శన్ రావు మాట్లాడుతూ... మానవ నాగరికత బుక్ కల్చర్ నుంచి రీల్స్ షాట్స్ వంటి లుక్ కల్చర్ వైపు మారుతుందని సోషల్ మీడియా ప్రభావంతో విదార్థుల్లో ఏకాగ్రత తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. –కవాడిగూడ
సందడే.. సందడి
సందడే.. సందడి
సందడే.. సందడి


