అజ్మీర్ షరీఫ్ దర్గాకు ప్రత్యేక రైలు
నాంపల్లి: నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి అజ్మీర్‌లోని హజరత్ ఖాజా మొహినుద్దీన్ చిస్తీ షరీఫ్ దర్గాకు బయలుదేరిన స్పెషల్ రైలును నాంపల్లి ఎమ్మెల్యే మహ్మద్ మాజీద్ హుస్సేన్ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఆయన భక్తులకు వీడ్కోలు పలికారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ అజ్మీర్ షరీఫ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేయాలని భక్తులను కోరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను నాంపల్లి నుంచి నడుపుతోందని తెలిపారు. అజ్మీర్‌లోని దర్గాకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వేకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.


