అఖిలేష్ సభ కోసం..ఇదేం పని ?
సాక్షి, సిటీబ్యూరో: సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిల్‌యాదవ్‌తో సభ నిర్వహణకు షెడ్ వేసేందుకు ఆదర్శ్‌నగర్‌లోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో చెట్లను తొలగించారు. ప్రజాప్రతినిధులు బస చేసే ఎమ్యెల్యే క్వార్టర్స్‌లో ఎవరైనా తెలియక చెట్లు నరికితే వారించాల్సింది పోయి.. సభా కార్యక్రమం కోసం చెట్లను నరికివేశారు. జీహెచ్‌ఎంసీ సిబ్బందితో పారిశుద్ధ్య, ఇతరత్రా పనులు చేయించారు. షెడ్డు ఏర్పాటుకు అడ్డుగా ఉన్నందున కొమ్మలు తొలగించాల్సిందిగా కోరితే.. తాము కొమ్మలు మాత్రమే తొలగించామని.. పనులు చేశాక తమ సిబ్బంది వెళ్లిపోయాక ఒక చెట్టు మొదలు వరకు నరికినట్లు తమ దృష్టికి వచ్చినట్లు సంబంధిత యూబీడీ విభాగం అధికారి తెలిపారు. దీంతో సంబంధిత ఫారెస్ట్ విభాగానికి తెలియజేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.


