305 మంది ‘నిషా’చరులకు చెక్!
సాక్షి, సిటీబ్యూరో: మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై నగర ట్రాఫిక్ విభాగం అధికారులు వీకెండ్స్‌తో ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగిస్తున్నారు. శుక్ర, శనివారాల్లో నగర వ్యాప్తంగా చేపట్టగా... 305 మంది మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ అధికారులకు పట్టుబడ్డారని ట్రాఫిక్ చీఫ్ డి.జోయల్ డెవిస్ ఆదివారం వెల్లడించారు. సమయం, ప్రాంతం, సందర్భాలతో సంబంధం లేకుండా ఆకస్మికంగా డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు చేశారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సైతం అనేక ప్రాంతాల్లో చేపట్టారు. వీటిలో పట్టుబడిన 305 మందిలో 242 మంది ద్విచక్ర, 26 మంది త్రిచక్ర, 35 మంది తేలికపాటి వాహనాల చోదకుల అని ట్రాఫిక్ చీఫ్ పేర్కొన్నారు. వీరందరికీ కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు.
సైబరాబాద్ పరిధిలో 231 మంది..
రాయదుర్గం: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ‘వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్’లో 231 మంది పట్టుబడ్డారు. 187 ద్విచక్రవాహనదారులు, 15 త్రీవీలర్లు, 29 నాలుగు చక్రాల వాహనదారులు ఉన్నారు.
● మాదాపూర్ పీఎస్‌పరిధిలో 17 మంది, గచ్చిబౌలి–21, నార్సింగి–14, రాయదుర్గం–19, మియాపూర్–29, కూకట్‌పల్లిలో అత్యధికంగా 35 కేసులు, బాలానగర్–10, జీడిమెట్ల–10, పటాన్‌చెరు–29, కేపీహెచ్‌బీ–11, మేడ్చెల్–14, ఆర్‌సీపురం పరిధిలో 22 మందిపట్టుబడ్డారు.


