హైదరాబాద్: నగరంలోని టోలిచౌకీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఐదంస్తుతల భవనం నుంచి పడి పలువురు కార్మికులు మృత్యువాత పడ్దారు.
ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్.. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో భవన నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు పైనుంచి కిందకు పడిపోయారు. దాంతో ముగ్గురు అడికక్కడే మృతిచెందగా, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.
.టోలిచౌకిలో జరిగిన ప్రమాదానికి సంబంధించి బిల్డింగ్‌కి G+2 మాత్రమే పర్మిషన్ ఉన్నట్టుగా గుర్తించారు. ఈ విషయంపై షేక్ పేట్ ఎమ్మార్వో స్పందించారు. ‘మిగతా ఫ్లోర్లకు పర్మిషన్ లేనందున బిల్డింగ్‌ని సీజ్ చేయబోతున్నాం. ఇద్దరు ఇక్కడికి ఇక్కడే మృతి చెందారు. ఇంకొకరు చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. మొత్తం ముగ్గురు మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న ఓలివ్ హాస్పిటల్లో చేర్చడం జరిగింది. మృతి చెందిన మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది.’ అని తెలిపారు.


