తెలంగాణవాళ్లు టూర్‌ ఇందుకే వెళ్తారు..!! | Telangana Travel trends Food Culture Skyscanner report | Sakshi
Sakshi News home page

తెలంగాణవాళ్లు టూర్‌ ఇందుకే వెళ్తారు..!!

Aug 5 2026 8:39 PM | Updated on Aug 5 2026 8:39 PM

Telangana Travel trends Food Culture Skyscanner report

దేశవ్యాప్తంగా పర్యాటక ఆసక్తులను తెలుసుకునేందుకు ప్రముఖ అంతర్జాతీయ ట్రావెల్‌ ఆపరేటర్‌ స్కైస్కానర్స్‌ ఇండియా ఓ అధ్యయనాన్ని నిర్వహించింది. దీని ఆధారంగా బంజారాహిల్స్‌లోని హయత్‌ ప్లేస్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తెలంగాణ వాసుల ప్రయాణాభిరుచులను వెల్లడించే కల్చర్‌ ట్రావెల్‌ ఇండెక్స్‌ నివేదికను విడుదల చేసింది.

దీని ప్రకారం, భారత దేశం వెలుపల పర్యటనలతో సహా ఎక్కడికి ప్రయాణించాలి? అనే అంశాన్ని ఆహారం, పండుగలు, చారిత్రక నేపధ్యాలే ప్రధానంగా నిర్ణయిస్తున్నాయి. ప్రాంతాల వారీగా ఆహార అనుభవాలు తమ పర్యటనలను ఎంచుకోవడానికి ప్రముఖ కారణంగా 56% స్పష్టం చేశారు. ఇటీవలి సంవత్సరాలలో సాంస్కృతిక పర్యటనలపై కూడా తమకు ఆసక్తి పెరిగిందని 83% మంది చెప్పారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్కైస్కానర్స్‌ చెందిన నీల్‌ ఘోస్‌ మాట్లాడుతూ ఇప్పుడు వెళ్లే స్థలం కంటే అక్కడ అందుకునే అనుభవంపైనే ప్రయాణ నిర్ణయాలు ఆధారపడి ఉంటున్నాయని చెప్పారు. ‘నేను ఎక్కడికి ప్రయాణం చేయాలి?’ అనే ప్రశ్న తో పాటు ‘నేను ఏమి అనుభవించాలనుకుంటున్నాను?’అనేది ప్రధానంగా మారింది’’ అని ఆయన వివరించారు.

హైదరాబాద్‌ సాంస్కృతిక గుర్తింపులో ఆహారం ఒక ప్రాథమిక భాగం’’ అని ఘోష్‌ చెప్పారు. అయితే, చార్మినార్‌  ఓల్డ్‌ సిటీ హెరిటేజ్‌ వాక్‌ల ద్వారా 39% మంది తెలంగాణ విశేషాలకు మరింత ప్రచారం  అవసరమని  అభిప్రాయపడ్డారు. దుర్గాపూజను 38% మంది దీపావళిని 37%, పొంగల్‌  కుంభమేళాలను 33% మంది చొప్పున తమ ప్రయాణాలకు కారణాలుగా చెప్పారు. బతుకమ్మను 32%, బోనాలు 31% మంది ఎంపిక చేసుకున్నారు.  

దేశీయ జాబితాలో కొచ్చి, ఉదయపూర్, అల్మోరా, కోల్‌కతా, ముంబై, లక్నో, పూరీ  కొహిమాలు హైదరాబాద్‌ ప్రయాణికులు ఇష్టపడే సాంస్కృతిక నేపధ్యం కలిగిన ప్రదేశాల జాబితాలో ఉన్నాయి. అంతర్జాతీయ సాంస్కృతిక ప్రయాణాల్లో తమ ఎంపికగా 22% మంది జపాన్‌ను ఎన్నుకున్నారు. థాయ్‌లాండ్,  వియత్నాంలకు 17%, ఫ్రాన్స్‌ 16%, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ 15%  ఇటలీ 10% మంది ఇష్టాల్ని గెలుచుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement