డయల్‌ 100కు గుడ్‌బై.. ఎమర్జెన్సీకి కొత్త నంబర్‌ | Dial 100 Is Gone: Telangana Launches New Emergency Number 112 | Sakshi
Sakshi News home page

డయల్‌ 100కు గుడ్‌బై.. ఎమర్జెన్సీకి కొత్త నంబర్‌

Aug 5 2026 12:11 PM | Updated on Aug 5 2026 12:24 PM

Dial 100 Is Gone: Telangana Launches New Emergency Number 112

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అత్యవసర సేవల కోసం ఇకపై డయల్‌ 100 స్థానంలో 112 నంబర్‌ అందుబాటులోకి వచ్చింది. పోలీస్‌ సహాయం, అంబులెన్స్‌, అగ్నిమాపక సేవలు వంటి అన్ని ఎమర్జెన్సీ సేవలకు ఇక ఒకే నంబర్‌ను వినియోగించుకోవచ్చు. బుధవారం డీజీపీ సీవీ ఆనంద్‌ అధికారికంగా 112 సేవలను ప్రారంభించారు.

ఇప్పటివరకు పోలీస్‌ సహాయం కోసం డయల్‌ 100కు కాల్‌ చేసే విధానం ఉండగా.. తాజాగా దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సిస్టమ్‌ (112)ను తెలంగాణలోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. అత్యవసర సమయంలో ప్రజలు 112కు కాల్‌ చేస్తే.. అవసరమైన సేవలను(పోలీస్‌, ఆంబులెన్స్‌, అగ్నిమాపక సేవలు) వెంటనే సమన్వయం చేసేలా వ్యవస్థను రూపొందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement